spot_img
Homeక్రైమ్‌Uttar Pradesh crime : భర్తను ఖతం చేసింది.. స్నానాల గదిలో పూడ్చింది.. పోలీసులకు దృశ్యం...

Uttar Pradesh crime : భర్తను ఖతం చేసింది.. స్నానాల గదిలో పూడ్చింది.. పోలీసులకు దృశ్యం సినిమా కళ్లకు కట్టింది..

Uttar Pradesh crime : ఒకప్పుడు అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని మనలోకం అనుకునేది. ఇప్పుడు భార్య లేని వాడు గొప్పవాడు అనుకునే రోజులు కచ్చితంగా వస్తాయేమో. ఈ భూమ్మీద మనుషులందరిలోనూ చెడ్డవాళ్ళు లేనట్టు.. భార్యలందరిలోనూ చెడ్డ భార్యలు లేరు. అయితే ఈ భార్య మాత్రం మహా చెడ్డది. ఎంత చెడ్డది అంటే.. పోలీసులకు చుక్కలు చూపించింది. 45 రోజులపాటు దృశ్యం సినిమాను లైవ్ లో చూపించింది.

అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా ప్రాంతం. ఆ ఏరియాలో 44 సంవత్సరాల సురేంద్ర కుమార్ శర్మ అనే వ్యక్తి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేశారు. ఉపయోగం లేకుండా పోయింది. చివరికి అతడి ఇంట్లో స్నానాల గది లో ఒక కీలక నిజం బయటపడింది. ఆ తర్వాత పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఈ వ్యవహారంలో సురేంద్ర భర్త రూబీ శర్మ వ్యవహరించిన తీరు పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విధంగా చేసింది. ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రేణుక దాం కాలనీ.. సికంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

మే 18 నుంచి సురేంద్ర కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు అడిగితే రూబీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. రోజులు గడిచినప్పటికీ అతడు ఇంటికి రాకపోవడంతో బంధువులు రూబీ మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. చివరికి మే 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసుల ముందుగా కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.. సురేంద్ర ఏదో ఊరు వెళ్ళాడని.. త్వరలోనే వస్తాడని పోలీసులకు చెప్పింది. అయితే పోలీసులు ఆమె మాట మీద నమ్మకం లేక వెతకడం మొదలుపెట్టారు..

సురేంద్రకు అనిల్ శర్మ అనే ఓ తమ్ముడు ఉన్నాడు. అన్నయ్య కోసం అనేక విధాలుగా వెతికాడు. ఎక్కడ కూడా సురేంద్ర జాడ కనిపించలేదు. పైగా సురేంద్రకు శత్రువులు లేరు. అలాంటప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాడు.. ఎందుకు వెళ్ళాడు.. అనే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. ఎన్ని విధాలుగా వెతికినప్పటికీ అతడి జాడ లభించకపోవడంతో పోలీసులు 45 రోజుల తర్వాత సురేంద్ర ఇంటికి వచ్చారు. రూబిని ఈసారి అనేక విధాలుగా ప్రశ్నించారు. అయితే ఈసారి రూబీ వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. అంతేకాదు పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు కట్టు కథలు చెప్పింది. ఇంట్లో తనిఖీలు చేయాలని పోలీసులు అడిగితే.. మొహమాట లేకుండా చేసుకోండి అని చెప్పింది.

పోలీసులు తనిఖీలలో భాగంగా స్నానాల గతి ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ కొత్త టైల్స్ కనిపించాయి. ఇల్లు మొత్తం పాత టైల్స్ ఉంటే.. అక్కడ మాత్రం కొత్త టైల్స్ ఉన్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి ఆ టైల్స్ తవ్వారు. అందులో కుళ్ళిపోయిన వాసన వచ్చింది. సురేంద్ర శవం అక్కడే పోలీసులు కనిపించింది. రూబీ ఇక ఎంత మాత్రం నిజాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. తన భర్తను చంపి అందులోనే గొయ్యి తీసి పాతిపెట్టింది. మట్టి పోసి.. సిమెంట్ వేసి టైల్స్ ఏర్పాటు చేయించింది. సురేంద్రకు మద్యం తాగే అలవాటు ఉండటం వల్ల.. రూబీ తో నిత్యం గొడవపడేవాడు. ఈ విషయం అతడి సోదరుడు అనిల్ కు కూడా తెలుసు. అందువల్లే అతడు పోలీసులతో తన వదిన మీదనే అనుమానం వ్యక్తం చేశాడు. కేవలం మద్యం మాత్రమేనా.. ఇంకా మరి ఏదైనా కోణం ఉందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular