spot_img
Homeఆంధ్రప్రదేశ్‌సుప్రీంకోర్టులో పిటిషన్ల విచారణకు గడువెందుకు?

సుప్రీంకోర్టులో పిటిషన్ల విచారణకు గడువెందుకు?

Supreme Courtఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్లు ఇబ్బడిముబ్బడిగా వేసింది. తీరా విచారణకు వచ్చేసరికి ముందుకు రావడం లేదు. విచారణకు సమయం కావాలని న్యాయవాదుల ద్వారా కోరుతోంది. దీంతో సర్కారు తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కరోజే నాలుగు కేసులు మూడు వారాలకు వాయిదా పడ్డాయి.

అమరావతి భూముల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనికి ప్రభుత్వం స్టే నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు ముందుకు వచ్చేసరికి విచారణకు మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్ స్పైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

ఇందులోనూ విచారణకు మూడు వారాల సమయం కావాలని కోరింది. మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి ఆస్తుల కొనుగోలు అంశంపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇందులో కూడా మూడు వారాల గడువు కావాలని అడిగింది. అన్ని కేసుల్లో ఇలాగే కోరడంపై న్యాయమూర్తి అంగీకరించడం జరిగిపోయాయి.

సుప్రీంకోర్టుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు వాదనలు వినిపించడానికి వెనకడుగు వేస్తోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో వైపు సీజేఐకి జగన్ లేఖను బహిర్గతం చేయడంపై చర్యలు తీసుకోవాలని గతంలో న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ చేశారు. ఈ పిటిషన్ పై వివరణ ఇవ్వడానికి సుప్రీంకోర్టును మూడు వారాల గడువు కోరారు. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వాయిదాల పద్ధతిని ఆశ్రయిస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version