పార్టీని గాడిలో పెట్టేందుకు రేవంత్ పాట్లు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అందరిని కలుపుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సీనియర్ నేత హనుమంతరావును అపోలో ఆస్పత్రిలో కలిశారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని అందరిని కలుపుకుని పోతానని ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతో మెల్లగా పీసీసీని గాడిలో పెట్టే పనిలో రేవంత్ పడ్డారని తెలుస్తోంది. అపోలో ఆస్పత్రికి చేరుకుని కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వీహెచ్ ను రేవంత్ రెడ్డి కలిసి కాసేపు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను […]

Written By: Srinivas, Updated On : June 29, 2021 8:30 pm
Follow us on

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అందరిని కలుపుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సీనియర్ నేత హనుమంతరావును అపోలో ఆస్పత్రిలో కలిశారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని అందరిని కలుపుకుని పోతానని ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతో మెల్లగా పీసీసీని గాడిలో పెట్టే పనిలో రేవంత్ పడ్డారని తెలుస్తోంది.

అపోలో ఆస్పత్రికి చేరుకుని కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వీహెచ్ ను రేవంత్ రెడ్డి కలిసి కాసేపు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నల్లు పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం వీహెచ్ ను కలిసి తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన వారిలో వీహెచ్ ముందుంటారు. కోమటిరెడ్డి సైతం కాస్త మెత్తబడినట్లు చెబుతున్నారు.

పీసీసీ విషయంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్లు అధిష్టానాన్ని కదిలించాయి. దీనికి హైకమాండ్ సీరియస్ అయింది. పార్టీ తీరుపై ఇష్టారాజ్యంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోమటిరెడ్డి తగ్గినట్లు భావిస్తున్నారు. ఇక రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేసినట్లు చెబతున్నారు. కోమటిరెడ్డి దుమారంపై కన్నెర్ర జేసింది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడరని విషయం తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం కట్టబెట్టినా అదే స్థాయిలో అందరిని కలుపుకుపోవాలని సూచించింది. దీంతో ఆయన నాయకులను తన వెంట ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీహెచ్ ను కలిసి పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఆందోళనలు, కార్యక్రమాల్లో కలిసి రావాలని కోరారు. ఇప్పుడిప్పుడే పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. ఇంకా అందరిని కలుసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.