ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో ఎందుకింత నిర్లక్ష్యం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఖజానా డీలా పడిపోవడంతో ఏపీలో సర్కారు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించారు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి. అయితే.. ఇప్పుడు లాక్‌డౌన్‌ ముగిసి ఖజానా కోలుకుంటున్నా ఇంకా వారి బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో సర్కార్‌‌ నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప.. లాయర్లకు డబ్బు చెల్లిస్తున్నారనే తప్ప వారికి హెల్ప్‌ చేయడం లేదు. Also Read: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు పన్నెండు శాతం […]

Written By: Srinivas, Updated On : February 9, 2021 2:18 pm
Follow us on


లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఖజానా డీలా పడిపోవడంతో ఏపీలో సర్కారు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించారు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి. అయితే.. ఇప్పుడు లాక్‌డౌన్‌ ముగిసి ఖజానా కోలుకుంటున్నా ఇంకా వారి బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో సర్కార్‌‌ నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప.. లాయర్లకు డబ్బు చెల్లిస్తున్నారనే తప్ప వారికి హెల్ప్‌ చేయడం లేదు.

Also Read: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడిన ఏపీ ప్రభుత్వం చివరికి వడ్డీ డిస్కౌంట్ మాత్రం తెచ్చుకుంది. పన్నెండు శాతానికి బదులు ఆరు శాతం వడ్డీతో ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదీ కూడా తమ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉందని కట్టలేమని ప్రభుత్వం తరపు న్యాయవాది బతిమాలడంతోనే ఈ కాస్త రిలీఫ్ కూడా ఇచ్చారు. లేకపోతే హైకోర్టు చెప్పినట్లుగా 12 శాతం జీతంతో చెల్లించాల్సి వచ్చేది.

లాక్‌డౌన్ పేరుతో రెండు నెలలపాటు ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం జీతం కోత వేసింది. ఇప్పటికే ఏడాది అవుతోంది. కానీ చెల్లించలేదు. మధ్యలో ఓ మాజీ ఉద్యోగి కోర్టుకు వెళ్లడంతో 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే వడ్డీతో చెల్లించడం నామోషీ అనుకున్న ప్రభుత్వం… వాటిని కొట్టి వేయాలని.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతంలో వడ్డీ లేకుండా చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. కానీ.. రెండు నెలలు మాత్రమే గడవు ఇచ్చింది. కానీ.. ప్రభుత్వం ఇలా ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఐదారు వాయిదాల్లో ఇవ్వాలని అనుకుంటోంది. దీంతో మళ్లీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: కేసీఆర్‌‌ను డిస్‌ క్వాలిఫై చేయాలంట..: గవర్నర్‌‌కు ఆ ఇద్దరు లేఖ

రెండు నెలలపాటు ఉద్యోగులు పెన్షనర్ల వద్ద కత్తిరించిన దాదారు రూ.ఆరు వేల కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తానికి ఆరు శాతం వడ్డీతో ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే పొందగలిగినంత రుణం పొందిన ఏపీ సర్కార్ ఓవర్ డ్రాఫ్ట్‌ల మీద బండి నడిపిస్తోంది. నెలాఖరుకు వచ్చే సరికి.. జీతాల కోసం ఎక్కడైనా అప్పులు దొరుకుతాయేమోనని ఎదురుచూస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికే బాకా ఊదుతున్నారు. అయితే.. సుప్రీంకోర్టు ఇంత కాలంలో చెల్లించాలని చెప్పలేదన్న కారణం చూపి.. ప్రభుత్వం ఆలస్యం చేసే అవకాశం కూడా ఉందంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్