టీవీఎస్ బంపర్ ఆఫర్.. రూ.2,500 చెల్లిస్తే స్కూటర్ మీ సొంతం..?

ప్రముఖ స్కూటర్ కంపెనీలలో ఒకటైన టీవీఎస్ కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. నెలకు 2,500 రూపాయలు సులభ వాయిదాలలో చెల్లిస్తే టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ స్కూటర్ ధర రూ.1,15,000 కాగా కనీసం 15 వేల రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.2569 చొప్పున నాలుగు సంవత్సరాలు చెల్లిస్తే కొత్త స్కూటర్ మీ సొంతమవుతోంది. Also Read: ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు […]

Written By: Kusuma Aggunna, Updated On : February 9, 2021 2:32 pm
Follow us on

ప్రముఖ స్కూటర్ కంపెనీలలో ఒకటైన టీవీఎస్ కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. నెలకు 2,500 రూపాయలు సులభ వాయిదాలలో చెల్లిస్తే టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ స్కూటర్ ధర రూ.1,15,000 కాగా కనీసం 15 వేల రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.2569 చొప్పున నాలుగు సంవత్సరాలు చెల్లిస్తే కొత్త స్కూటర్ మీ సొంతమవుతోంది.

Also Read: ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు రూ.1,300 చెల్లిస్తే లక్షల్లో రాబడి..?

మూడు సంవత్సరాల పాటు రూ.3,200 చొప్పున చెల్లిస్తే కూడా ఈ స్కూటర్ ను పొందవచ్చు. ప్రీమియంను పెంచే కొద్దీ కాలపరిమితి తగ్గుతుంది. ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో పెట్రోల్ లేకుండానే ఈ స్కూటర్ ను నడపవచ్చు. అయితే ఈ స్కూటర్ ను తక్కువ మొత్తం ఈ.ఎం.ఐ చెల్లించి పొందాలంటే మాత్రం నెలవారీ శాలరీ కనీసం 15,000 రూపాయలు ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది.

Also Read: ఉద్యోగులకు హెచ్‌సీఎల్ శుభవార్త.. రూ. 700 కోట్ల స్పెషల్ బోనస్..?

మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్స్ ఇస్తే ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి లోన్ ను పొందవచ్చు. ఈ వాహనం కొనుగోలు చేసే సమయంలో 10,000 రూపాయలు అదనంగా చెల్లిస్తే ఇంట్లోనే వెహికిల్ ఛార్జింగ్ డివైజ్ ను ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ స్కూటర్ ను ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. టీవీఎస్ కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఈ స్కూటర్ కు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

గంటకు గరిష్టంగా 78 కిలోమీటర్ల వేగంతో ఈ స్కూటర్ పై ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్ ను కొనుగోలు చేయడం ద్వారా ఐదు సంవత్సరాలలో 60 వేల రూపాయలు ఆదా అవుతుందని తెలుస్తోంది. సాధారణ ఫ్యూయెల్ స్కూటర్ తో పోలిస్తే ఈ స్కూటర్ ను కొనుగోలు చేస్తే ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది.