Minister Ambati Rambabu: ఏపీలో అంబటి రాంబాబు స్టైలే వేరు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యర్థులపై పంచ్ లు, షట్టైర్లు వేయడంలో ముందుంటారు. మాట మార్చి మరీ ప్రత్యర్థులను బురిడీ కొట్టిస్తుంటారు. తన నోటితో కట్టడి చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఎదుటి వ్యక్తిని అష్ట దిగ్బంధం చేయగల నేర్పరి ఆయన. అదే ఆయనకు కేబినెట్ లో బెర్త్ దక్కేటట్టు చేసింది. గంభీరమైన గొంతు, చక్కటి హెయిర్ క్రాఫ్ తో సగటు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయన పుణికి పుచ్చుకున్నారు. కానీ ఆయన షడన్ గా చేంజ్ అయ్యారు. గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఇప్పుడవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన ఎవరో చెప్పుకోండి అని నెటిజెన్లను ప్రశ్నిస్తున్నాయి. అయితే నిశితంగా పరిశీలించే వరకూ తెలియదు. ఆయన మన అమాత్యుడు అంబటి రాంబాబు అని. అయితే అంటి తాజా పిక్చర్స్ చూసి ఆయన అభిమానులు తెగ బాధపడుతున్నారు. ఇలా మారిపోయారేంటి అని ఆరా తీయడం ప్రారంభించారు.

వాస్తవానికి అంబటికి ఆరు పదుల వయసు దాటింది. అయినా యంగ్ గా కనిపించేందుకు ఇష్టపడతారు. తలకు హెయిర్ డై వేసుకుంటారు. మీషాలకు సైతం కలర్ పూస్తారు. ఆపై వైట్ అండ్ వైట్ ఖద్దరు ధారణతో .జిగేల్ మనిపిస్తుంటారు. గ్లామర్ తగ్గకుండా మెయింటెన్ చేస్తుంటారు. అయితే ఇటీవల అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ఆయన్ను చూసిన వారు తొలుత పోల్చుకోలేకపోయారు. తీరా అంబటి అని తెలుసుకొని అసలు ఆయనకు ఏమైందని తోటి ఎమ్మెల్యేలు ఒకరికొకరు వాకబు చేసుకునేదాక పరిస్థితి వచ్చింది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ అంశం రచ్చరంబోలాగా మారింది. అంబటికి అభిమానించే వారు అధికమే. అటు ఆయన దూకుడును వ్యతిరేకించే వారూ ఎక్కువే. అందుకే ఎవరికి నచ్చినట్టు వారు అన్వయించుకుంటున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
అయితే అంబటి స్టైల్ మార్పు వెనుక ఒక కథ నడిచిందన్న టాక్ అయితే మాత్రం ఉంది. ఇటీవల ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూకు అంబటిని సంప్రదించారుట. లేడీ యాంకర్ కు ఇంటర్వ్యూ ఇస్తాను కానీ.. తిరిగి ఏమి ఇస్తారంటూ మన అంబటి వారు ప్రశ్నించారుట. దీంతో ఇది వివాదాస్పదమైంది. ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఈ వివాదం నడుస్తునే ఉంది. అయితే ఈ ఎపిసోడ: అంతా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది అట. ఇక మంత్రిగా మారిన తరువాత ఇటువంటి చిలిపి చేష్టలకు చెక్ చెప్పాలని అంబటి వారు స్టైల్ మార్చారుట. వయసు పైబడిన వాడిగా మారిపోతే ఇక ఎవరు తనను అనుమానించరన్నది మన అంబటి వారి భావనట. మొత్తానికైతే యంగ్ చార్మింగ్ తో ఉండే అంబటి వయసు పైబడిన మనిషిగా మారడం వెనుక పెద్ద కథే నడిచిందన్నమాట.

మరోవైపు మంత్రి అంబటి రాంబాబు సినిమాల్లో కూడా నటిస్తున్నట్టు తెలిసింది. బీచ్ లో హోయలొలికించే హీరోయిన్ ఆయన పక్కన ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోలు బట్టి ఆయనది మెయిన్ రోల్ గా తెలుస్తోంది. అయితే కథలో భాగంగా ఆయన వయసుపైబడిన వ్యక్తిగా కనిపిస్తారన్న టాక్ అయితే ఉంది. అందుకే గెటప్ చేంజ్ చేశారని తెలుస్తోంది. అయితే అంబటి నటిస్తున్న సినిమా ఏమిటి? ఆ హీరోయిన్ ఎవరు? దర్శకుడు ఎవరు? ఎవరు నిర్మిస్తున్నారు అన్నది మాత్రం బయటకు ఇంతవరకూ వెల్లడి కాలేదు.