RRR- Nikhil: తెలుగు సినిమా ఖ్యాతి ఏనాడో ఖండాంతరాలు దాటింది. మన సినిమాలు విదేశాల్లో కూడా ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే మన సినిమాలకు ప్రచారం అక్కర్లేదు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు నామినేషన్ కు వెళ్లడంతో అంతా అవార్డు వస్తుందని ఆశించారు. కానీ మన ఆశ తీరలేదు. అవార్డు దక్కలేదు. దీంతో అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా ఆస్కార్ అవార్డు వస్తేనే మనకు గుర్తింపు వచ్చినట్లా అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎన్నో ఆశలతో వెళ్లిన ట్రిపుల్ ఆర్ కు ఆస్కార్ దక్కకపోవడంపై అందరిలో నిరాశే కనిపిస్తోంది.

దీనిపై పలువురు మాట్లాడుతూ ఆస్కార్ వచ్చినా రాకున్నా మన తెలుగు సినిమా స్థాయి ఏంటో అందరికి తెలిసిందే. మన సినిమాలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఏనాడో వచ్చింది. బాహుబలితో ఇంకా రెట్టింపయ్యింది. ఇన్ని విధాలుగా మన సినిమా ఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే కదా. ఇంకా మనకు ఆస్కార్ ఎందుకు? అవసరమా? రాకపోతే ఏం కాదులే అనే కామెంట్లు వస్తున్నాయి. మనమేంటో మనకు తెలుసు. మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలుసు. అలాంటిది ఆస్కార్ వస్తేనే మనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చినట్లా అనే సందేహాలు కూడా ఉన్నాయి.
ఆస్కార్ అవార్డుకు ఆర్ఆర్ఆర్ నామినేట్ కాకపోవడంపై ప్రముఖ హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్కార్ ప్రతిష్టాత్మకమైనదిగా భావించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. ఆస్కార్ వస్తేనే అదో విజయంగా అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన తెలుగు సినిమాలు విదేశాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇదొక్కటే చాలు మన సినిమా ఖ్యాతి గురించి చెప్పడానికి. ఇంతటి విలువ కలిగిన మన సినిమా ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండటమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఆస్కార్ సర్టిఫికెట్ కోసం వెంపర్లాడటం ఎందుకు? మన సినిమాలు అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా రేంజ్ ఏమిటో అర్థం కావడం లేదా? అనే వాదనలు వస్తున్నాయి. ప్రజల ప్రేమ, అభిమానం ఉండాలే కానీ అవార్డులు కాదు మన దశను తిప్పేవి. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రానంత మాత్రాన పోయే నష్టమేం లేదని చెబుతున్నారు. నిఖిల్ చెబుతున్న మాటలు కూడా నిజాలే అని తెలుస్తోంది. ఆస్కార్ కోసం అర్రులు చాచాల్సిన అవసరం లేదు. దీంతో ఆస్కార్ నామినేషన్ రాకపోవడంపై పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి అవసరం లేదని చెబుతున్నాడు.