కరోనా సెకండ్ వేవ్లో కేసులు పెరుగుదలతో పాటు మరణాలు కూడా అధికంగానే పెరిగాయి. అయితే కరోనాతో మహిళల కంటే పురుషులే ఎక్కువగా చనిపోతున్నారని ఫస్ట్ వేవ్ లోనూ కొంతమంది వైద్య నిపుణులు వెల్లడించారు. సెకండ్ వేవ్లోనూ అదే జరగడంతో పురుషుల మరణాలకు కారణం ఏంటనేది పరిశోధకులు కొన్ని పరీక్షలు చేశారు. ఈమేరకు అమెరికాలోని మిస్సౌరీలోని సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆప్ మెడిసిన్ పరిశోధకులు కరోనాతో పురుషులు అధికంగా చనిపోవడానికి కారణం ఇది కావచ్చిన ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు.
వారు చేసిన అధ్యయనం ప్రకారం మహిళల కంటే పురుషుల్లో తక్కువ టెస్టోస్టెరాన్ ఉండడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని రుజువు చేయలేము. కానీ ఈ సమయంలో టెస్టోస్టెరాన్ తగ్గితే కరోనా దాడికి ఎక్కువ అవకాశం ఉంటుందని అనుకుంటున్నామని విశ్వవిద్యాల ప్రొఫెసర్ అభినవ్ దివాన్ జామా నెట్ వర్క్ ఓపెన్ అనే పత్రికలో పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో పురుషుల్లో టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే ఇంటెన్సివ్ కేర్ అవసరం పడుతుందని మాత్రం చెప్పగలమని తెలిపారు.
సాధారణంగా వయోజన పురుషుల్లో 250 గ్రాములు లేదా అంతకంటే తక్కువ నానో గ్రాములు ఉంటే తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న పురుషులుగా పరిగణిస్తారని వారు పేర్కొన్నారు. ఇక కరోనా ప్రారంభ దశ ఉన్న పురుషుల్లో 151 నానోగ్రాములు, కరోనా తీవ్రస్థాయిలో ఉన్న వారిలో 53 నానో గ్రాములు మాత్రమే ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించామన్నారు.
ఈ అధ్యయనం కోసం 90 మంది పురుషులు, 62 మంది మహిళల నుంచి రక్తనమూనాలు సేకరించామన్నారు. వీరిలో 143 మంది ఆసుపత్రిలో ఉన్నారు. సేకరించిన రక్తనమూనాలు మూడే, ఏడు, 14 మరియు 28 రోజుల తరువాత పరీక్షలు చేసి హర్మోన్ల స్థాయిని గుర్తించామన్నారు. అయితే మొత్తంగా రక్తంలో టెస్టోస్టెరాన్ అత్యల్ప స్థాయిలో ఉంటే మాత్రం వెంటిలేటర్ పైకి వెళ్లే ప్రమాదముందన్నారు.