కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు అదిరిపోయే శుభవార్త..?

దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతుండగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీల సంఖ్యనే ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజా అధ్యయనం కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైరస్ నుంచి కోలుకున్న వారిలో కొన్ని నెలల తర్వాత కూడా రోగ నిరోధక కణాలు యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడైంది. ఇలాంటి కణాలు జీవితకాలం కొనసాగే వీలు ఉంటుందని సంస్థ తెలిపింది. ఇలాంటి కణాలు శరీరంలో జీవితకాలం కొనసాగే వీలుందని […]

Written By: Kusuma Aggunna, Updated On : May 26, 2021 11:48 am
Follow us on

దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతుండగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీల సంఖ్యనే ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజా అధ్యయనం కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైరస్ నుంచి కోలుకున్న వారిలో కొన్ని నెలల తర్వాత కూడా రోగ నిరోధక కణాలు యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడైంది. ఇలాంటి కణాలు జీవితకాలం కొనసాగే వీలు ఉంటుందని సంస్థ తెలిపింది.

ఇలాంటి కణాలు శరీరంలో జీవితకాలం కొనసాగే వీలుందని అందువల్ల వీళ్లు భవిష్యత్తులో అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గుతాయని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. స్వల్పస్థాయి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిలో మాత్రమే ఈ విధంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు.

అయితే తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో మాత్రం యాంటీబాడీలు వేగంగా తగ్గే అవకాశం ఉంటుంది. యాంటీబాడీలు ఉత్పత్తి చేసే కణాల్లో కొన్ని దీర్ఘకాలం కొనసాగుతాయని వాటిని ప్లాస్మా కణాలు అంటారని అవి యాంటీబాడీలను రక్తంలోకి విడుదల చేస్తారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న 77 మందిపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

స్వల్ప స్థాయి కరోనా లక్షణాలు ఉన్నవారి నుంచి కరోనా సోకిన 8 నెలల తర్వాత ఎముక మజ్జ నమూనాలను సేకరించి శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. యాంటీబాడీల స్థాయి తగ్గినా కొంతకాలం తర్వాత మిగిలిన యాంటీబాడీలు స్థిరంగా కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.