2019 అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ.. ఎంపీ ఎలక్షన్లు కొంత ఉపశమనం కలిగించాయి. వైసీపీకి హవా నడుస్తున్న తరుణంలోనే టీడీపీకి మూడు సీట్లు వచ్చాయి. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ఎంపీలుగా గెలుపొందారు. గతంలో వీరికి ఉన్న మైలేజీనే వీరిని మళ్లీ గెలిపించింది. ప్రతిసారీ పార్లమెంట్‌లో ప్రజల సమస్యలు వినిపించడంలో వీరు సక్సెస్ అయ్యారు. అందుకే వీరికి మరోసారి ఓటర్లు పట్టం కట్టారు. రెండోసారి గెలిచిన వీరు ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. అంతగా యాక్టివ్ రోల్ పోషించడం లేదు.
Also Read: ‘అంతర్వేది’ ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసుల సంచలనం
జగన్ ప్రభుత్వం కొలువుదీరాక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో ప్రకటించిన అమరావతి రాజధానినే కొనసాగిస్తూనే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షంలో ఉన్న ఈ ముగ్గురు ఎంపీలు కూడా చాలా రోజులపాటే పోరాడారు. కానీ.. తర్వాత ఈ మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం కూడా దొరకడంతో తర్వాత పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఏదో సోషల్ మీడియాలో పోస్టులు తప్ప, బయట అంతగా అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు లేవు. రాజధాని పరిధిలో ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఏమీ మాట్లాడడం లేదు.
అయితే.. గల్లా యాక్టివ్ రోల్ ప్లే చేయకపోవడానికి చాలా కూడా ఓ కారణం వినిపిస్తోంది. ఆయన త్వరలోనే పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారని ప్రచారం నడుస్తోంది. గల్లా ఇప్పటికే బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని, తన వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే బీజేపీ గూటికి చేరుతారని అంటున్నారు.
Also Read: కబ్జాదారులకు షాక్ ఇవ్వబోతున్న జగన్ సర్కార్…?
కేవలం గల్లానే కాదు, రామ్మోహన్, కేశినేని కూడా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం నడుస్తోంది. అయితే.. ఇంత ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు ఎంపీల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. పార్టీ మారుతున్నామని కానీ.. టీడీపీ వీడడం లేదనే విషయంపై కానీ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అయితే, బీజేపీలోకి వెళ్తే ఈ నాలుగేళ్లు ఎలాంటి కష్టాలు ఉండవని భావిస్తున్నా.. తర్వాత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలవడం కష్టమని భావిస్తున్నారట.
Comments are closed.