Homeఆంధ్రప్రదేశ్‌Purandheshwari : పురంధేశ్వరిని అంత తిడుతున్నా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు? అసలేంటి కారణం

Purandheshwari : పురంధేశ్వరిని అంత తిడుతున్నా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు? అసలేంటి కారణం

Purandheshwari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైసీపీకి టార్గెట్ అవుతున్నారు. అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత ఆమె జగన్ సర్కార్ పై పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని లక్ష్యంగా చేసుకున్నారు. సంక్షేమ పథకాల మాటున జరుగుతున్న లూటీ, మద్యం,ఇసుకవంటి వాటిలో అవినీతిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఏపీ సర్కార్ చేస్తున్న అప్పులపై ఎప్పటికప్పుడు ధ్వజమెత్తుతున్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి మించి… పురందేశ్వరి పై వైసీపీ స్వరం పెంచింది.

అయితే ఈ క్రమంలో వైసీపీ నేతలు ఆమెపై వ్యక్తిగత హననాలకు పాల్పడుతుండడం విశేషం. అయితే ఇలా విమర్శ చేస్తున్న వైసీపీ నేతలు కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం.. ఏపీ బీజేపీ వారికి శత్రువుగా మారిపోయింది. ముఖ్యంగా పురందేశ్వరి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని అనుమానిస్తూ.. వైసీపీ నేతలు ఓ రేంజ్ లో విరుచుకుపడుతుండడం విశేషం. ఈ విషయంలో వైసీపీలోని వివాదాస్పద నేతలు రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంత జరుగుతున్న రాష్ట్రంలోని తోటి బిజెపి నాయకులు పురందేశ్వరికి మద్దతు పలకడం లేదు. వైసీపీ నేతల విమర్శలను ఖండించడం లేదు. అటు కేంద్ర పెద్దలు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న పెద్దన్న పాత్రలో తామున్నామని..అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందని.. అయితే రాష్ట్ర శాఖలుగా మీరు ప్రభుత్వంపై పోరాటం చేయండి అని బిజెపి హై కమాండ్ ఆదేశాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలుగా పురందేశ్వరి గట్టిగానే పోరాటం ప్రారంభించారు. రాష్ట్ర అప్పులపై వైసీపీ సర్కార్ చేస్తున్న దుష్ప్రచారంపై ఫోకస్ పెట్టారు. నిజాలు నెగ్గు తేల్చాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. కానీ ఆమె వైసీపీ నేతలు ఇచ్చిన నివేదికలనే పార్లమెంటులో చదివారు. అటు తరువాత మద్యం కుంభకోణం పై ఏకంగా కేంద్రమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి చర్యలు లేవు. కనీసం దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.

అయితే ఇలా తమ పార్టీపై టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేతలు పురందేశ్వరి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆమెపై తిరిగి ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే ఆమె పోరాడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎంత చేస్తున్నా ఇది తప్పు అని ఖండించే రాష్ట్ర బిజెపి నాయకులు కనిపించకపోవడం విచారణ. అటు కేంద్ర పెద్దలు సైతం వైసీపీ నేతలను సముదాయించే ప్రయత్నం చేయడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ బీజేపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీ కోసం తాను పనిచేస్తుంటే.. తనపై వ్యక్తిగత దాడికి దిగినప్పుడు పార్టీ అండగా నిలబడడం లేదని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version