Telugu library: అమెరికాలో విస్తరిస్తున్న ‘తెలుగు’.. డల్లాస్ లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం..

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ 4వ అతిపెద్ద నగరం. ఈ నగరంలో తెలుగువారు అత్యధికంగా ఉంటారు. ప్రతీ ఈవెంట్ లో డల్లాస్ తెలుగువారు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ కార్యక్రమైనా ఇక్కడ నిర్వహిస్తారు.

Written By: Chai Muchhata, Updated On : November 6, 2023 12:51 pm
Follow us on

Telugu library: పొరుగు గడ్డ అమెరికాలో ‘తెలుగు’ మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఇంగ్లీషు దేశంలో తెలుగు భాషను కాపాడుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే అన్నీ కల్చరల్స్ ఈవెంట్స్, పండుగలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. తాజాగా ఇక్కడి డల్లాస్ లో తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ నగర శివారులోని లూయిస్ విల్ లో ప్రవాసాంధ్రుడు మల్లవరపు అనంత్ R2 Reality అనే కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దీనిని ప్రముఖ గాయకులు ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ, తాజా అధ్యక్షుడు తోటకరూర ప్రసాద్ లు కలిసి ప్రారంభించారు.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ 4వ అతిపెద్ద నగరం. ఈ నగరంలో తెలుగువారు అత్యధికంగా ఉంటారు. ప్రతీ ఈవెంట్ లో డల్లాస్ తెలుగువారు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ కార్యక్రమైనా ఇక్కడ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తాజాగా తెలుగు గ్రంథాలయంను ఏర్పాటు చేశారు. తెలుగు భాషను ప్రపంచానికి విస్తరించాలన్న ఉద్దేశంతో పాటు ఇక్కడున్న తెలుగువారికి సౌకర్యంగా ఉండేందుకు తెలుగు గ్రంథాలయంలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆశ, ధ్యాస తెలుగు భాష అని కొనియాడారు. ఆస్టిన్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో తెలుగు కోర్రసుల నిమిత్తం నిధుల సేకరణ చేస్తున్న సమయంలోనే ఎస్పీ బాలు విభావరితో అలరించాలని కోరామన్నారు. తానా ప్రపంచ వేదిక ఆధ్వర్యంలో ఆరు సంపుటిలుగా వెలువరించిన సిరివెన్నెల సమగ్ర సాహిత్యాన్ని ఈ సందర్భంగా శైలజ-చరణ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే త్వరలోనే తానా ఆధ్వర్యంలో కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని వెలువరిస్తామని తెలిపారు.

ప్రముఖ గాయని ఎస్పీ శైలజ మాట్లాడుతూ అమెరికాలో తెలుగు గ్రంథాలయం ఉండడం గర్వకారణమని అన్నారు. మాతృభాషకు దూరంగా ఉండకుండా ఈ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అమెరికాలో వివిధ పనుల నిమిత్తం ఎంతో మంది తెలుగువారు వస్తున్నారని, వారు తెలుగును మరిచపోకుండ చేసిన ప్రయత్నం సరైనదని అన్నారు. తెలుగు భాషపై ఉన్న మక్కువతో గ్రంథాయంకు పాఠకులు వస్తారని ఆమె ఆకాంక్షించారు.