World Cup 2023: సెకన్ కు రూ.3 లక్షలు.. వరల్డ్ కప్ తో భారత్ కు ఇన్ని కోట్ల ఆదాయం…

ముందుగా వరల్డ్ కప్ మ్యాచ్ లను చూసినందుకుగాను టెలివిజన్ సంస్థలు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత చెల్లించాలి అనేది కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి ఉంటుంది.

Written By: Gopi, Updated On : November 6, 2023 12:36 pm
Follow us on

World Cup 2023: ప్రస్తుతం ప్రపంచ దేశాలు మొత్తం వరల్డ్ కప్ ఆడటం లో బిజీగా ఉన్నాయి. అలాగే ప్రతి జట్టు కూడా తమదైన రీతిలో మ్యాచులను ఆడుతూ సెమీఫైనల్ కి వెళ్లడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరల్డ్ కప్ ఇండియా లో ఆడుతున్నారు అలాగే ఇండియా అనే కాదు, ప్రతి దేశం కూడా వరల్డ్ కప్ కి అతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తూ ఉంటుంది. అసలు వరల్డ్ కప్ ఆడడం వల్ల ఆ దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఎంత మేరకు ఆదాయం వస్తుంది అనే లెక్కలు సైతం రీసెంట్ గా ఒక నివేదిక ద్వారా తెలియజేశారు. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ ఇండియాలో ఆడుతుంది కాబట్టి ఈ మ్యాచ్ లా ద్వారా ఇండియా కి భారీగా లాభాలు వస్తున్నాయి అనే విషయం అయితే ప్రస్ఫుటం గా తెలుస్తుంది. వరల్డ్ కప్ ఆడటం ద్వారా ఏ రకంగా డబ్బులు వస్తాయనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ముందుగా వరల్డ్ కప్ మ్యాచ్ లను చూసినందుకుగాను టెలివిజన్ సంస్థలు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత చెల్లించాలి అనేది కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ కోసం స్టార్ సంస్థ 12 వేల కోట్లను చెల్లించింది.ఇక ఇవే కాకుండా ఓటితి సంస్థలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఇక వీటితో పాటు గా స్టేడియంలో మ్యాచ్ చూడ్డానికి వచ్చిన వారు ఒకరే రాకుండా కనీసం ఇద్దరు ముగ్గురు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వస్తారు. అలాగే కొంతమంది అయితే వాళ్ళ గ్రూప్ మొత్తాన్ని తీసుకొని వస్తారు కాబట్టి దాదాపు మ్యాచ్ 8 గంటల పాటు సాగుతుంది కాబట్టి ఆ టైంలో వచ్చిన వాళ్ళు తినే ఫుడ్ మీద కూడా డబ్బులనేవి భారీగా వస్తాయి. ఆ ఫుడ్డు మీదనే దాదాపు మొత్తం మ్యాచ్ లు ముగిసేసరికి 5000 కోట్ల రూపాయలు రానున్నట్టుగా లెక్కలు తెలుపుతున్నాయి. ఇక మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల టికెట్స్ మీద కూడా దాదాపు 2000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది…

అలాగే మ్యాచ్ ఆడుతున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ మీద కూడా చాలా ఆదాయం వస్తుంది మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఓవర్ కి ఓవర్ కి మధ్య వచ్చే 10 సెకండ్ల యాడ్ కోసం దాదాపుగా 30 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు గా తెలుస్తుంది…అంటే సెకండ్ కి మూడు లక్షలు చొప్పున పడుతుంది. ఇక గత వరల్డ్ కప్ తో పోల్చుకుంటే ఇప్పుడు యాడ్ రేట్ అనేది 40% పెరిగిందనే చెప్పాలి… ఇక అలాగే ఇండియన్ టీమ్ ఫైనల్ దాకా చేరుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఫైనల్ దాకా ఇండియా వెళ్తే మ్యాచ్ చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది.

అలాగే ఎక్కువమంది స్పాన్సర్స్ ముందుకు రావడం జరుగుతుంది. ఇక దాంతోపాటుగా మ్యాచ్ చూసేవారు సంఖ్య కూడా పెరుగుతోంది.దాంతో పాటుగా ఒక్కొక్క యాడ్ మీద వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది.దానివల్ల ఇండియా ఫైనల్ కి వస్తే మన ఇండియా కి ఇంకా చాలా లాభాలు చేకూరుతాయి. మొత్తం ఈ వరల్డ్ కప్ ముగిసే సమయానికి ఇండియాకి 26 వేల కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని లెక్కలు చెప్తున్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీ లో 22,000 కోట్ల రూపాయలు… ఇంత భారీ అమౌంట్ అనేది ఆదాయంగా వస్తుంది కాబట్టే ప్రతి దేశం కూడా వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటుంది…