
హైదరబాద్ నగరంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈమేరకు ఎవరైనా ఆకలి ఉంటే 040- 21111111 ఫోన్ నెంబరును సంప్రదించాలని సూచించారు. అన్నార్థుల కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసిందని తెలిపారు. హ్యాష్ ట్యాగ్‌తో #040-21111111 ఫోన్ నెంబర్ ను తన ట్వీటర్లో షేర్ చేశారు. ఈ నెంబరును వీలైనంత ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆమె కోరారు.
హైదరాబాద్ నగరంలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ లాక్డౌన్ సమయంలో జీహెచ్‌ఎంసీతోపాటు తొమ్మిది కార్పొరేషన్లలో 300అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రోజు రెండు లక్షల మందికి భోజనం పెడుతున్నట్లు ఉన్నతాధికారులు గతంలో పేర్కొన్నారు. వీటి ద్వారా అన్నార్థులకు రెండు పూటలా భోజనం అందిస్తున్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల కూడా ఇంకో 50 అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గతం ఈ కేంద్రాలు మధ్యాహ్నం వరకు మాత్రమే పని చేసేవని తెలిపారు. ప్రస్తుతం అన్నపూర్ణ కేంద్రాలు ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5గంటలకు భోజనం అందించేలా వేళలు మార్చినట్లు తెలిపారు. ఇది చాలా మంచి కార్యక్రమని నటి మంచు లక్ష్మీతో పాటు పలువురు సీని, రాజకీయ ప్రముఖులు కవితను ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు.