
AP Free Laptop Scheme 2021: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ పలు సంక్షేమ పథరాలతో దూసుకుపోతున్నారు. ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్న పథకాలను వీడటం లేదు. ఇచ్చిన వాగ్దానాల అమలుకు శ్రీకారం చుడుతున్నారు. కానీ ఆర్థిక లోటును భర్తీ చేసుకునే క్రమంలో పథకాల అమలు కాస్త ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెడతామన్న ల్యాప్ టాప్ పథకం అమలుకు అడ్డంకులే ఎదురవుతున్నాయి. దీంతో పథకం ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నారు. మొదట ఇచ్చిన మాట ప్రకారం కాకుండా జనవరిలో ఇస్తామని చెప్పడంతో విద్యార్థుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
కానీ ఈ పథకం జూన్లో అమలు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విద్యాసంవత్సరం మొదలై సగం అయిపోవడంతో జనవరిలో ల్యాప్ టాప్(AP Free Laptop Scheme 2021) లు ఇస్తే మళ్లీ జూన్ లో ఇవ్వాల్సి వస్తుందనే ఉధ్దేశంతో జూన్ లోనే వాటిని పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జగన్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. అమ్మఒడి పథకం ద్వారా ల్యాప్ టాప్ లు అందజేయాలని ప్రభుత్వం భావించింది.
అమ్మఒడి పథకం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు నేరుగా ఆదాయం వేస్తే వేరే అవసరాలకు వాడతారనే ఉద్దేశంతో ల్యాప్ టాప్ లే విద్యార్థులకు అందజేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల వివరాలు ఇప్పటికే సేకరించింది. వారందరికి డైరెక్టుగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుందా అని చూస్తున్నారు.
అయితే మార్కెట్ లో ల్యాప్ టాప్ ధర కనీసం పాతికవేలు ఉండటంతో ప్రభుత్వం తక్కువ ధరకే కొనుగోలు చేయాలని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా పలు కంపెనీలను కలిసి ల్యాప్ టాప్ ల గురించి చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోరకలు తీరాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అని తెలుస్తోంది. మొత్తానికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటుందో లేదా చూడాలి మరి.