https://oktelugu.com/

కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారా.. నిజమేంటంటే..?

టెక్నాలజీ వినియోగం పెరిగిన తరువాత సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రజల్లో చాలామంది సరైన అవగాహన లేకపోవడంతో ఆ ఫేక్ న్యూస్ లను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్ లో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే రెండు సంవత్సరాలలో చనిపోవడం ఖాయమని ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేకపోయినా ప్రజల్లో చాలామంది ఆ వార్తను నిజమేనని నమ్ముతున్నారు. ఫ్రెంచ్​ వైరాలజిస్ట్​, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 26, 2021 / 12:34 PM IST
    Follow us on

    టెక్నాలజీ వినియోగం పెరిగిన తరువాత సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రజల్లో చాలామంది సరైన అవగాహన లేకపోవడంతో ఆ ఫేక్ న్యూస్ లను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్ లో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే రెండు సంవత్సరాలలో చనిపోవడం ఖాయమని ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేకపోయినా ప్రజల్లో చాలామంది ఆ వార్తను నిజమేనని నమ్ముతున్నారు.

    ఫ్రెంచ్​ వైరాలజిస్ట్​, నోబెల్​ గ్రహీత అయిన టుక్​ మోటాగ్నైర్​ చెప్పిన మాటలను వక్రీకరించి ఆయన చెప్పినట్టు ఈ వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు. 2008 సంవత్సరంలో మోటాగ్నైర్​ హెచ్​ఐవీపై పరిశోధనలు చేసి ఆ పరిశోధనల ద్వారా నోబెల్ ప్రైజ్​ ను అందుకున్నారు. అయితే ఆయన కరోనా వ్యాక్సిన్స్​ వల్లే ఇప్పుడు కొత్త వేరియెంట్స్ పుడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హెచ్​ఐవీ నుంచి జెనెటిక్​ మెటీరియల్​తో ఈ వైరస్ ను తయారు చేశారని ఆయన పేర్కొన్నారు.

    కరోనా వైరస్ ను మనిషే తయారు చేశాడని ఆయన చెబుతున్నారు. ఎయిడ్స్ కు మందు కనిపెట్టే క్రమంలో జరిగిన పరిశోధనల వల్లే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి ఫేక్ న్యూస్ లను వైరల్ చేయవద్దని అధికారులు, పోలీసులు కోరుతున్నారు. ఫేక్ న్యూస్ వైరల్ చేసిన వాళ్లకు కఠిన శిక్షలు పడే అవకాశం అయితే ఉంది.

    కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గడంతో పాటు వైరస్ సోకినా త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వ్యాక్సిన్ తీసుకోని వారు ఇప్పటికైనా తీసుకుంటే మంచిది.