Homeఆంధ్రప్రదేశ్‌పేకాట ఆడితే తప్పేముంది..? ఏపీ మంత్రుల నీతి వాక్యాలు

పేకాట ఆడితే తప్పేముంది..? ఏపీ మంత్రుల నీతి వాక్యాలు

Pocker game
కోడిపందేలు.. పేకాటకు కేరాఫ్‌ ఆంధ్ర. ఈ రెండు ఆటలను అక్కడి నేతలైనా.. అక్కడి ప్రజలైనా ఎంతో ప్రెస్టేజీగా తీసుకుంటారన్నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే.. అక్కడ అధికారంలోకి ఉన్న నేతలే పేకాట క్లబ్బులను నిర్వహిస్తుంటారు. చాలా మంది గొప్పగొప్ప లీడర్లు ఈ క్లబ్బులకు ఓనర్లు కూడా. అయితే.. క్లబ్బులు నడిపిస్తున్న మంత్రులు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. ఏ అంశంపైనైనా విమర్శిస్తే తప్పేంటి అని ఎదురు దాడి చేస్తున్నారు. ఇతర విషయాల సంగతేమో కానీ.. పేకాట విషయంలోనూ అదే వాదన వినిపిస్తుండడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read: జగన్ అప్ డేటెడ్ పాలిటిక్స్.. బాబు పార్టీ ఖతమేనా?

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేకాట, కాసినోల్లో సమయం గడిపేస్తున్నారని.. ప్రజలను పట్టించుకోవడం లేదని.. ఒంగోలు పర్యటనల్లో నారా లోకేష్ విమర్శించారు. వెంటనే బాలినేని రంగంలోకి వచ్చారు. తాను మిత్రులతో సరదాగా మిత్రులతో పేకాట ఆడతానని.. పేకాట ఆడితే తప్పేంటని ప్రశ్నించారు. అంతే కాదు.. కాసినోలకూ వెళ్తానన్నారు. అందులోనూ తప్పేంటని ప్రశ్నించారు.

మంత్రి బాలినేని రియాక్షన్ చూసి.. గతంలో కొడాలి నాని అన్న కామెంట్లు అందరికీ గుర్తొచ్చాయి. గుడివాడలో పెద్ద ఎత్తున పేకాట క్లబ్‌లు ఉన్నాయి. వాటిపై పోలీసులు రైయిడ్ చేసి.. ఓ సందర్భంలో పెద్ద ఎత్తున పట్టుకున్నారు. అందులో కొడాలి నాని దగ్గరి బంధువులు కూడా ఉన్నారు. ఈ రైయిడ్స్ జరిగిన వెంటనే కొడాలి నాని హుటాహుటిన ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి.. పేకాట ఆడితే తప్పేంటని ప్రశ్నించారు.

Also Read: కాంగ్రెస్ పిచ్చి వ్యూహాలే కొంపముంచుతున్నాయా?

అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి పేకాట ఆడుతున్న వారిని పట్టుకుంటే ఉరి వేయరని.. రూ.50 ఫైన్ కట్టి వచ్చి మళ్లీ ఆడుకుంటారని స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో వైసీపీ ప్రభుత్వం.. మంత్రుల వ్యవహారశైలిపై అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్లయింది. ఓ వైపు.. పేకాటను మట్టు పెట్టేస్తాం.. ఆన్ లైన్‌లోనూ ఆడకుండా చేస్తామని నిషేధం విధించిన ప్రభుత్వంలోని పెద్దలు.. ఇలా ఆడతామని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశం అయింది. అప్పుడు కొడాలి నాని.. ఇప్పుడు బాలినేని పేకాట ఆడితే.. ఆడిస్తే తప్పేంటన్నట్లుగా మాట్లాడటంతో అవి టీడీపీకి అస్త్రంలా దొరికాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version