యుద్ధం నుంచి.. ఉద్భ‌వించిన‌ మహిళా దినోత్సవం..!

ఇంట‌ర్నేష‌న‌ల్ ఉమెన్స్ డే గురించి ఇప్పుడు అంద‌రికీ తెలుసు. మార్చి 8వ తేదీ వ‌చ్చిందంటే.. మ‌హిళా సాధికార‌త‌పై అంద‌రూ ప్ర‌సంగిస్తుంటారు. మ‌హిళా అభ్యున్న‌తి గురించి అంద‌రూ మాట్లాడుతారు. మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై అంద‌రూ ఎలుగెత్తుతారు. అయితే.. అస‌లు మ‌హిళా దినోత్స‌వం ఎలా ప్రారంభ‌మైంది? ఎక్క‌డ పుట్టింది? ఎందుకు పురుడు పోసుకుంది? అనే విష‌యాలు మాత్రం చాలా మందికి తెలియ‌దు. ఆ వివ‌రాలు ఇప్పుడు మీకోసం… Also Read: పేకాట ఆడితే తప్పేముంది..? ఏపీ మంత్రుల నీతి వాక్యాలు […]

Written By: Bhaskar, Updated On : March 8, 2021 12:35 pm
Follow us on


ఇంట‌ర్నేష‌న‌ల్ ఉమెన్స్ డే గురించి ఇప్పుడు అంద‌రికీ తెలుసు. మార్చి 8వ తేదీ వ‌చ్చిందంటే.. మ‌హిళా సాధికార‌త‌పై అంద‌రూ ప్ర‌సంగిస్తుంటారు. మ‌హిళా అభ్యున్న‌తి గురించి అంద‌రూ మాట్లాడుతారు. మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై అంద‌రూ ఎలుగెత్తుతారు. అయితే.. అస‌లు మ‌హిళా దినోత్స‌వం ఎలా ప్రారంభ‌మైంది? ఎక్క‌డ పుట్టింది? ఎందుకు పురుడు పోసుకుంది? అనే విష‌యాలు మాత్రం చాలా మందికి తెలియ‌దు. ఆ వివ‌రాలు ఇప్పుడు మీకోసం…

Also Read: పేకాట ఆడితే తప్పేముంది..? ఏపీ మంత్రుల నీతి వాక్యాలు

అంకురార్ప‌ణ ఇలా..
అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం కార్మిక ఉద్య‌మం నుంచి ఉద్భ‌వించింది. 1908లో ఈ కార్య‌క్ర‌మానికి బీజాలు ప‌డ్డాయి. ప‌నిగంట‌ల త‌గ్గింపు, మెరుగైన వేత‌నంతోపాటు ఓటు వేసే హ‌క్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మ‌హిళ‌లు మొద‌టిసారిగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ మ‌హిళ‌ల న్యాయ‌మైన డిమాండ్ల‌ను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోష‌లిస్టు పార్టీ మ‌హిళా దినోత్స‌వ నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైంది. ఆ విధంగా.. 1909వ సంవ‌త్స‌రంలో జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని ప్ర‌క‌టించింది.

కార‌ణం ఆమే..
ఈ మ‌హిళా దినోత్స‌వాన్ని నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న క్లారా జెట్కిన్ అనే మ‌హిళ‌కు వ‌చ్చింది. కోపెన్ హెగెన్ న‌గ‌రంలో 1910లో జ‌రిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్’ మీటింగ్ లో ఆమె ఈ ప్ర‌తిపాద‌న చేశారు. మొత్తం 17 దేశాల నుంచి ఈ స‌ద‌స్సుకు హాజ‌రైన వంద మంది మ‌హిళ‌లు క్లారా జెట్కిన్ ప్ర‌తిపాద‌న‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఏక‌గ్రీవంగా ఈ ఆలోచ‌న‌కు అంగీకారం తెలిపారు.

Also Read: సొంత పార్టీకే ఎసరుపెట్టిన చింతమనేని

మొద‌టి సారిగా…
ఇంట‌ర్నేష‌న‌ల్ ఉమెన్స్ డేను మొద‌టి సారిగా 1911లో డెన్మార్క్, జ‌ర్మ‌నీ, ఆస్ట్రియా, స్విట్జ‌ర్లాండ్ దేశాల్లో నిర్వ‌హించారు. 2011లో అంత‌ర్జాతీయ మహిళా దినోత్స‌వ శ‌తాబ్ధి ఉత్స‌వాలు జ‌రిగాయి. కాగా.. 1975లోనే అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని ఐరాస అధికారికంగా గుర్తించింది. అంతేకాదు.. ప్ర‌తీ సంవ‌త్స‌రం ఒక థీమ్ తో ఈ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తోంది.

మార్చి 8నే ఎందుకంటే..?
మ‌హిళా దినోత్స‌వం మార్చి 8నే నిర్వ‌హించ‌డానికి కూడా ఓ కార‌ణం ఉంది. 1917 వార్ స‌మ‌యంలో ర‌ష్యా మ‌హిళ‌లు ‘ఆహారం-శాంతి’ కావాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. నాలుగు రోజుల తర్వాత రష్యా చక్రవర్తి నికోలస్ జా-2 అధికారం కోల్పోయాడు. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం.. మహిళలకు ఓటు హక్కును కల్పించింది. మహిళలు సమ్మెకు దిగిన రోజు మార్చి 8. అందుకే.. అదే రోజును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ‘గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్ కు ప్రణాళికలు రచించుకోవడం’ అనే మొదటి థీమ్ తో మొదలైన ఈ వేడుకలు.. ప్రతీఏటా సరికొత్త థీమ్ తో కొనసాగుతున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్