కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో లభించే పండ్లలో అరటిపండ్లు ముందువరసలో ఉంటాయి. అరటిపండ్లు తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారా..? తగ్గుతారా..? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. చాలామంది అరటిపండు తింటే బరువు పెరుగుతారని భావిస్తున్నా శాస్త్రవేత్తలు మాత్రం అరటిపండ్లు బరువు తగ్గడానికి కారణమవుతాయని వెల్లడిస్తున్నారు.
అయితే రోజుకు రెండు అరటిపండ్లు తింటే మాత్రమే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో అరటిపండ్లను తీసుకుంటే మాత్రం బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అరటిపండ్ల ద్వారా శరీరానికి అవసరమైన పొటాషియం లభిస్తుంది. సాధారణంగా ఏదైనా అనారోగ్యం బారిన పడితే శరీరంలో నీరు చేరుతుంది. అరటిపండ్లు ఎక్కువగా తింటే శరీరంలో నీరు చేరకుండా చేయడంలో సహాయపడుతుంది.
స్పైసీ ఫుడ్ ఫ్రైలు, మసాలాలు, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ తినడం తగ్గిస్తే శరీర బరువును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. అయితే అరటిపండ్లు బాగా పండినవి తింటే మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అరటిపండ్లు ప్రో-బయోటిక్ గుణాలను కూడా కలిగి ఉంటాయి కాబట్టి శరీరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి. ఈ బ్యాక్టీరియా ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
పొట్ట,నడుం చుట్టూ కొవ్వు తగ్గించి శరీరంలో కొవ్వు పెరగకుండా చేయడంలో అరటిపండ్ల ద్వారా శరీరంలో చేరే బ్యాక్టీరియా సహాయపడుతుంది. . అరటి పండ్లలో ఉండే బి విటమిన్ కొవ్వును పెరగనివ్వకుండా చేయడంతో పాటు కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది.