Husbend Wife: రాత్రి 9 గంటల వరకూ.. కాబోయే భర్తకు బంపర్ ఆఫర్ ఇచ్చిన నవ వధువు

Husbend Wife: పెళ్లిళ్ల స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. కానీ అది తప్పు ఇక్కడే పరస్పర అంగీకారంతోనే జరుగుతాయని వారికి తెలియదు. ఇటీవల కాలంలో వివాహాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లికి ముందే ఒప్పందాలు, అంగీకారాలు విచిత్రంగా ఉంటున్నాయి. వివాహం కాకముందే ఇద్దరు పరస్పరం అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మనసులు కలవకుంటే కాపురం చేయడం కూడా కష్టమే. మనస్పర్దలతో విడిపోయే వారు చాలా మంది ఉన్నారు. పెళ్లికి ముందే వారి అభిప్రాయాలు పంచుకుంటే తరువాత ఎలాంటి చిక్కులు ఉండవు. […]

Written By: NARESH, Updated On : November 13, 2022 4:16 pm
Follow us on

Husbend Wife: పెళ్లిళ్ల స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. కానీ అది తప్పు ఇక్కడే పరస్పర అంగీకారంతోనే జరుగుతాయని వారికి తెలియదు. ఇటీవల కాలంలో వివాహాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లికి ముందే ఒప్పందాలు, అంగీకారాలు విచిత్రంగా ఉంటున్నాయి. వివాహం కాకముందే ఇద్దరు పరస్పరం అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మనసులు కలవకుంటే కాపురం చేయడం కూడా కష్టమే. మనస్పర్దలతో విడిపోయే వారు చాలా మంది ఉన్నారు. పెళ్లికి ముందే వారి అభిప్రాయాలు పంచుకుంటే తరువాత ఎలాంటి చిక్కులు ఉండవు. చిన్న చిన్న విషయాలకే కాపురాలు గుల్ల చేసుకునే వారు మనకు కోకొల్లలు కనిపిస్తారు. నేనంటే నేనే ఎక్కువ అనే ఫీలింగే వారిని అలా చేస్తోంది. దీంతో కాపురాలు మధ్యలోనే విడిపోతున్నాయి.

కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. పెళ్లి కుమారుడి గుణగణాలు, పెళ్లి కూతురు ఇష్టాఇష్టాలు ఏమీ తెలియకుండానే ఒక్కటవుతారు. తరువాత అభిప్రాయాలు కలవక విడిపోతారు. పచ్చని సంసారంలో గొడవలతో దూరం అయిన వారు చాలా మంది ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కేరళలోని పాలక్కడ్ లో జరిగిన సంఘటన అందరిని ఆశ్చర్యపరచింది. రఘు, అర్చన అనే జంట ఇటీవల పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందే వారు రూ.50 బాండ్ పేపర్ మీద పెళ్లి కుమార్తె సంతకం చేసింది. భర్త ఇష్టానికి భిన్నంగా ప్రవర్తించనని చెప్పింది.

ఇంతకీ ఆ బాండ్ పేపర్ లో ఏముందంటే పెళ్లి తరువాత కూడా రాత్రి తొమ్మిది గంటల వరకు తన స్నేహితులతో తిరిగినా అభ్యంతరం చెప్పొద్దనేది విషయం. దీనికి ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకుని సంతకం చేసింది. దీంతో వారి వివాహం జరిగింది. పెళ్లికి ముందే వరుడు తనకు కావాల్సిన విషయం చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలకు ఆస్కారం ఉండదు. తన ఎంజాయ్ కు అడ్డురానని ఆమె అంగీకరించింది. ఇలా పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటే పది కాలాల పాటు పచ్చగా సంసారం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ బాండ్ పేపర్ వైరల్ అవుతోంది. పెళ్లి కూతురు వరుడికి ఇచ్చిన ఆఫర్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఫన్నీగా చూస్తున్నా మరికొందరు మాత్రం ఇది సరైన చర్యగానే అభివర్ణిస్తున్నారు. హిందూ వివాహ వ్యవస్థలో ఎన్నో నిబంధనలు ఉన్నా పెళ్లి కుమారుడు మాత్రం తనకు కావాల్సిన అవసరాన్ని ఆమెతో ఒప్పించుకుని మరీ పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదిఏమైనా వారు పరస్పరం అంగీకరించడం మును ముందు మంచి పరిణామాలకే దారి తీస్తోందనేది పలువురి వాదన.