spot_img
Homeక్రైమ్‌Family Dispute : ప్రియుళ్లతో కలిసి మొగుళ్లనే లేపేస్తున్నారు.. ఏం సమాజం రా బై

Family Dispute : ప్రియుళ్లతో కలిసి మొగుళ్లనే లేపేస్తున్నారు.. ఏం సమాజం రా బై

Family Dispute : మేఘాలయ హనీమూన్ హత్యోదంతం జరిగాక.. ఏ మొగుడు అనుమానం ఉన్న భార్యను నమ్మడం లేదు. ఎక్కడ తమను లేపేస్తారోనని కపట భార్యలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఆడవాళ్ల చేష్టలు ఎక్కడిదాకా వెళ్లాయంటే ఏకంగా ప్రియుడిని వద్దన్నందుకు అతడితోనే కలిసి మొగుడిని లేపేసే స్థాయికి దిగజారింది. దీంతో ఈ సమాజం ఎటుపోతోంది? అన్న ఆందోళనలు నెలకొన్నాయి.

వివాహేతర సంబంధాలు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య, ఆమె ప్రియుడితో కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జగ్గు తండాలో చోటుచేసుకుంది.

జగ్గు తండాకు చెందిన బానోతు రమేష్, శాంతలకు సుమారు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆటో డ్రైవర్‌గా పని చేసుకుంటూ రమేష్ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా శాంత అదే తండాకు చెందిన మరో ఆటో డ్రైవర్ అయిన దేవేందర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

ఈ వ్యవహారంపై రమేష్ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. దీంతో ఆగ్రహానికి గురైన శాంత, ఆమె ప్రియుడు దేవేందర్ లు ఏకంగా రమేష్‌ను చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఇటీవల దేవేందర్ కత్తితో రమేష్‌పై దాడి చేయడానికి ప్రయత్నించగా, రమేష్ చాకచక్యంగా తప్పించుకున్నాడు.

ఈ సంఘటనతో తీవ్ర భయాందోళనలకు గురైన రమేష్ తనకు తన భార్య శాంత, ఆమె ప్రియుడు దేవేందర్ నుండి ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version