పవన్ కు ఏమైంది? ఎందుకు బయటకు రావట్లేదు?

కరోనా వైరస్ సోకాక దాదాపు 20 రోజులు చికిత్స పొందిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో, ట్విట్టర్ లోనూ కనిపించకుండా పోయారు. అంతకుముందు ఐసోలేషన్ పేరిట క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ దాదాపు రెండు నెలలుగా యాక్టివ్ రోల్ పోషించడం లేదు. వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఫంక్షన్ తర్వాత లక్షణాలతో క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ ఆ తర్వాత కరోనా పాజిటివ్ గా తేలడంతో తన ఫాం హౌస్ లోనే చికిత్సపొందారు. రాంచరణ్ తన […]

Written By: NARESH, Updated On : May 31, 2021 9:55 am
Follow us on

కరోనా వైరస్ సోకాక దాదాపు 20 రోజులు చికిత్స పొందిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో, ట్విట్టర్ లోనూ కనిపించకుండా పోయారు. అంతకుముందు ఐసోలేషన్ పేరిట క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ దాదాపు రెండు నెలలుగా యాక్టివ్ రోల్ పోషించడం లేదు.

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఫంక్షన్ తర్వాత లక్షణాలతో క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ ఆ తర్వాత కరోనా పాజిటివ్ గా తేలడంతో తన ఫాం హౌస్ లోనే చికిత్సపొందారు. రాంచరణ్ తన పరపతితో అపోలో వైద్యులను, సౌకర్యాలను కల్పించి బాబాయ్ పట్ల శ్రద్ధ తీసుకున్నారు.

ఈ కారణంగానే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి.. అలాగే వకీల్ సాబ్ విజయోత్సవాలకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోయారు. పవన్ కోలుకున్నాక నీరసం అయిపోయాడని.. అందుకే నెలరోజుల పాటు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు అలా బయటకు రావడం లేదని అంటున్నారు.

కరోనా కల్లోలం.. లాక్ డౌన్ కూడా పవన్ బయటకు రాకపోవడానికి కారణంగా చెబుతున్నారు. ఈ రెండు నెలల్లో పవన్ కేవలం ప్రెస్ నోట్ల ద్వారా మాత్రమే కనిపించారు. అదీ పార్టీ ఇచ్చింది మాత్రమే.. బీఏ రాజు మరణం, ఎంపీ రఘురామ అరెస్ట్, రుయా ఆస్పత్రిపై పవన్ పేరిట జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది.

కరోనా లాక్ డౌన్ ముగస్తుండడంతో పవన్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని.. సినిమాల్లోనూ యాక్టివ్ కావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.