
పట్టణాల్లో ఉండే ప్రజలకు తిప్పతీగ గురించి ఎక్కువగా అవగాహన లేకపోయినా పల్లెల్లో ఉండేవాళ్లకు మాత్రం తిప్పతీగ గురించి కచ్చితంగా అవగాహన ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతగానో సహాయపడే తిప్పతీగ ఒక యువకుడు కోట్ల రూపాయలు సంపాదించడానికి కారణమవుతోంది. సైన్స్ లో సైతం తిప్పతీగ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రూవ్ కావడం గమనార్హం.
అయితే మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన సునీల్ పవార్ తిప్పతీగతో కోట్ల రూపాయల కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. తన వ్యాపారం ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్న సునీల్ పవార్ మొదట అడవుల్లో లభించే ఔషధ గుణాలు ఉన్న మొక్కలపై దృష్టి పెట్టాడు.ఆ సమయంలో అతనికి తిప్పతీగ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని తెలిసింది. మొదట తిప్పతీగను సేకరించి సునీల్ పవార్ కంపెనీలకు అందించే వ్యాపారాన్ని మొదలు పెట్టాడు.
ప్రధానమంత్రి వన్ధన్ పథకం సాయంతో సునీల్ వన్ధన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రెండేళ్ల క్రితం ఏడాదికి రూ.5 లక్షలు సంపాదించాడు. డాబర్, బైద్యనాథ్, హిమాలయ వంటి సంస్థలకు తిప్పతీగను సరఫరా చేయడానికి తరువాత కాలంలో కోటీ 57 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ను దక్కించుకున్నాడు. సునీల్ పవార్ కు ప్రస్తుతం ఏకంగా 6 వన్ధన్ కేంద్రాలు ఉన్నాయి.
తిప్పతీగ సహాయంతో హెపటైటిస్, ఆస్తమా, జ్వరం, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలను సులభంగా నయం చేయవచ్చు. తిప్పతీగ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరుతాయి.