https://oktelugu.com/

మొన్న ఎగ్జిట్.. నేడు రీఎంట్రీ.. సీనియర్ జర్నలిస్ట్ వెనుక ఏం జరిగింది?

ఇటీవలే ఓ దమ్మున్న చానెల్ నుంచి తీవ్ర ఆరోపణలతో వైదొలగిన సదురు సీనియర్ జర్నలిస్ట్ మళ్లీ అదే చానెల్ లోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించడం చర్చనీయాంశమైంది. నిన్నటినిన్న వారం పాటు సెలవు పెట్టి పోయానని సదురు జర్నలిస్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు. చానల్ లోని ఉద్యోగులకు వారంరోజుల పాటు సెలవు పెడుతున్నానని సదురు జర్నలిస్ట్ చెప్పుకొని ఎగ్జిట్ అయ్యాడు. కానీ అది సెలవు కాదని.. శాశ్వత తొలగింపు అని ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో […]

Written By: , Updated On : March 25, 2021 / 09:57 PM IST
Follow us on

ఇటీవలే ఓ దమ్మున్న చానెల్ నుంచి తీవ్ర ఆరోపణలతో వైదొలగిన సదురు సీనియర్ జర్నలిస్ట్ మళ్లీ అదే చానెల్ లోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించడం చర్చనీయాంశమైంది. నిన్నటినిన్న వారం పాటు సెలవు పెట్టి పోయానని సదురు జర్నలిస్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు.

చానల్ లోని ఉద్యోగులకు వారంరోజుల పాటు సెలవు పెడుతున్నానని సదురు జర్నలిస్ట్ చెప్పుకొని ఎగ్జిట్ అయ్యాడు. కానీ అది సెలవు కాదని.. శాశ్వత తొలగింపు అని ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో కొంత మంది ఆయన రూ.50 లక్షలు బ్లాక్ మెయిలింగ్ చేసి దొరికిపోయాడని, అందుకే యాజమాన్యం తొలగించిందని ప్రచారాన్ని ఉధృతం చేశారు.

సెలవు పెడితే చానల్ అంతగా ఆయన్ను దూరం పెట్టదు. పై స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి.. గౌరవంగానే ఏ సంస్థ అయినా వ్యవహరిస్తుంది. ఆ గౌరవాన్ని పోగొట్టుకునేలా చేయడంతోనే సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది. సదరు జర్నలిస్టు రూ.50 లక్షలు బ్లాక్ మెయిలింగ్ చేశాడా..? లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ సదరు చానల్ యాజమాన్యాన్ని మాత్రం ఇబ్బంది పెట్టాడని స్పష్టం అవుతోంది

అయితే ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరికీ ఇద్దరి లూప్ హోల్స్ ఉన్నాయి సదు చానెల్ తోపాటు ఆ సీనియర్ జర్నలిస్ట్ సైతం కాంప్రమైజ్ అయినట్టు సమాచారం. మనో రూ.50 లక్షల బ్లాక్ మెయిలింగ్ కథ తెలిసి యాజమాన్యం నిలదీయగా.. సంస్థలోని గుట్టు మట్లు అంతా బయటపెడుతానని సదురు జర్నలిస్టు బెదిరించాడని.. అంతేకాదు.. ఆ సంస్థలోని ఓ ఎఫైర్ ను కూడా బయటపెడుతానని వార్నింగ్ ఇచ్చినట్టు జర్నలిస్టు సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తన బాస్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సదురు జర్నలిస్టు సూచించారట.. ఈ మేరకు 24 గంటలు గడవక ముందే చానెల్ గుట్టు మట్లు అన్ని తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ తిరిగి అదే చానెల్ కు రావడానికి డిసైడ్ అయ్యారట..

ఇంత కథ జరిగి.. బ్లాక్ మెయిల్ ఆరోపనలు వచ్చినా కూడా ఆ చానెల్ తిరిగి అతడిని తీసుకోవడమే ఇప్పుడు జర్నలిస్టు సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది. చానెల్ బండారం.. నిధుల వ్యవహారం.. అమరావతి నుంచి వస్తున్న నిధులు బయటపెడుతాడనే కారణంతోనే ఆ చానెల్ జర్నలిస్టును గతి లేక తీసుకుందనే ప్రచారం జర్నలిస్టు సర్కిల్స్ లో జరుగుతోంది.

ఇలా వివాదాస్పద రీతిలో చానెల్ నుంచి వైదొలిగిన జర్నలిస్టు తిరిగి అదే చానెల్ లోకి రాబోతుండడం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఒకరి బండారం మరొకరికి తెలుసు అని అందుకే ఇద్దరూ బయటపడకుండా మళ్లీ కలిశారని టాక్ వినిపిస్తోంది.