https://oktelugu.com/

వెంకటేశ్, వరుణ్ ల కోసం బాలయ్య బ్యూటీ..

ఎఫ్2తో సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి దానికి కొనసాగింపుగా తీస్తున్న మూవీ ఎఫ్3. దిల్ రాజు నిర్మాణంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోగా అదే పాత్రధారులతో తీస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే తమన్నా, మెహరీన్ కథానాయకులు.. వెంకీ, వరుణ్ భార్యలుగా నటిస్తున్నారు. అయితే సినిమాలో మూడో హీరోయిన్ కూడా ఉంది. ఆ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ హీరోయిన్ సోనాలి చౌహాన్ ను ఎంపిక చేసుకున్నారట.. ఈమె ఇదివరకు బాలయ్య బాబుతో రెండు […]

Written By: , Updated On : March 25, 2021 / 10:07 PM IST
Follow us on

ఎఫ్2తో సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి దానికి కొనసాగింపుగా తీస్తున్న మూవీ ఎఫ్3. దిల్ రాజు నిర్మాణంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోగా అదే పాత్రధారులతో తీస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమాలో ఇప్పటికే తమన్నా, మెహరీన్ కథానాయకులు.. వెంకీ, వరుణ్ భార్యలుగా నటిస్తున్నారు. అయితే సినిమాలో మూడో హీరోయిన్ కూడా ఉంది. ఆ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ హీరోయిన్ సోనాలి చౌహాన్ ను ఎంపిక చేసుకున్నారట..

ఈమె ఇదివరకు బాలయ్య బాబుతో రెండు సినిమాలు చేసింది. మరికొన్ని సినిమాలు కూడా చేసినా అంతగా పేరు రాలేదు. గ్యాప్ తర్వాత ఎఫ్3తో రీఎంట్రీ ఇస్తోంది.

అయితే చిన్న పాత్ర కోసం ఈమెను తీసుకున్నట్టు టాక్. సోనాలిని కవ్వించే పాత్రలో చూపించబోతున్నారట.. ఎఫ్2ను మించి నవ్వులు పంచేందుకు ఎఫ్3ని రెడీ చేశారని.. ఈ సినిమాను అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.