
CP Ranganath: టెన్త్ హిందీ ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో వరంగల్ సీపీ ప్రెస్‌మీట్‌పెట్టి టెన్త్ పేపర్ లీక్ కాలేదని మొదట ప్రకటించారు. మరుసటి రోజు ప్రెస్‌మీట్ పెట్టి బయటకు రావడం వెనుక బీజేపీ కుట్ర ఉందని, బండి సంజయ్ కుట్ర చేశారని వెల్లడించారు. ఈ కేసులో బండిని ఏ1గా చేర్చారు. అయితే ఈ విషయంలో ఒక రోజు జైల్లో ఉన ్న సంజయ్ మరుసటిరోజు బయటకు వచ్చారు. రంగనాథ్‌పై విమర్శలు చేశారు. లీకేజీకి, మాల్‌ప్రాక్టీస్‌కు తేడా తెలియదని మండిపడ్డారు. హిందీ పేపర్ ఎవడైనా లీక్ చేస్తాడా అని ప్రశ్నించారు. తనపై పెట్టిన కేసులు నిజమైనవే అని సీపీ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
అక్రమాలు బయటకు తెస్తామని వార్నింగ్..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకే వరంగల్ సీపీ తనపై అక్రమ కేసు పెట్టాడని బండి ఆరోపించారు. రెండు ప్రెస్‌మీట్లలో రెండు విధాలుగా సీపీ మాట్లాడడమే ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన సీపీ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. తన అరెస్ట్‌కు ముందు సీపీకి వచ్చిన ఫోన్‌కాల్స్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా రంగనాథ్ ఖమ్మం, నల్లగొండ, విజయవాడలో పనిచేసినప్పుడు చేసిన అక్రమాలను తవ్వుతున్నామని, త్వరలోనే అవి బయటపెడతామని హెచ్చరించారు.
తిప్పికొట్టిన సీపీ..
సంజయ్ ఆరోపణలను సీసీ రంగనాథ్ తిప్పికొట్టారు. తాను ప్రమాణం చేయాల్సి వస్తే పదివేలసార్లు చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. తన బాధితులంతా లోఫర్లు, భూకబ్జాదారులు, చీటర్లు ఉంటారని తెలిపారు. వరంగల్‌లో తాను బాధ్యతలు చేపట్టాక భూకబ్జాదారుల భరతం పడుతున్నానన్నారు. బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.

వరంగల్‌వాసుల నిరసన…
రంగనాథ్‌పై బండి సంజయ్ రాజకీయ ఆరోపణలు చేయడం, బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడడాన్ని వరంగల్ జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అనవసర రాజకీయాల్లోకి రంగనాథ్‌ను లాగొద్దని హెచ్చరిస్తున్నారు. సీపీ రంగనాథ్ పేదలకు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. భూఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటున్నారని, పేదల భూములు తిరిగి ఇప్పిస్తున్నారని తెలిపారు. పేదల పాలిట దేవుడిగా మారిన సీపీని రాజకీయాల్లోకి లాగడం, రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.
దీంతో ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది అన్నట్లుగా మారింది బీజేపీ పరిస్థితి. రంగనాథ్‌ను ఇరుకున పెట్టే క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కమలనాథులు ఇరకాటంలో పడ్డారు.