Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. ఓటేసేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. రాష్ట్రవ్యాప్తంగా 70,02 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. అత్యధికంగా భువనగిరిలో 90.2 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 45 శాతం నమోదైనట్లు వెల్లడించారు. గత ఎన్నికలతో పనోలిస్తే ఈసారి 3 శాతం ఓటింగ్ తగ్గినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ జిల్లాలోనూ ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. గత ఎన్నికలో పోలిస్తే అన్ని నియోజకవర్గాల్లో 2 నుంచి 3 శాతం పోలింగ్ తక్కువగా నమోదైంది.
నియోజకవర్గాల వారీగా ఇలా..
– కరీంనగర్ నియోజకవర్గంలో 2014లో 58.77 శాతం పోలింగ్ నమోదు కాగా, 2018లో 69.29 శాతం నమోదైంది. ఈసారి మాత్రం 5 శాతం తగ్గింది. 64.17 శాతమే ఓట్లు వేశారు.
– మానకొండూర్ నియోజకవర్గంలో 2014లో 80.31 శాతం నమోదు కాగా, 2018లో 3 శాతం పెరిగి 85.36 శాతం నమోదైంది. ఈసారి మాత్రం 2 శాతం పోలింగ్ తగ్గింది. ఈసారి 83.2 శాతం నమోదైంది.
– హుజూరాబాద్ నియోజకవర్గంలో 2014లో 77.54 శాతం నమోదు కాగా, 2018లో 7 శాతం పెరిగి 84.40 శాతం నమోదైంది. ఈసారి మాత్రం ఒకశాతం తగ్గింది. 83.19 శాతం నమోదైంది.
– చొప్పదండిలో 2014లో 73.27 శాతం నమోదు కాగా, 2018లో ఐదు శాతం పెరిగింది. 79.73 శాతం నమోదైంది.2023లో మాత్రం 2 శాతం తగ్గి 77.77 శాతం నమోదైంది.
– ధర్మపురిలో 2014లో 74.44 శాతం పోలింగ్ నమోదు కాగా, 2018లో 6 శాతం పెరిగి 80.19 శాతం నమోదైంది. ఈసారి మాత్రం ఒక శాతం తగ్గింది. 79.54 శాతం నమోదైంది.
– జగిత్యాల నియోజకవర్గగంలో 72.01 శాతం నమోదు కాగా, 2018లో 6 శాతం పోలింగ్ పెరిగింది. 78.83 శాతం నమోదైంది. ఈసారి మాత్రం 3 శాతం తక్కువగా నమోదైంది. 75,42 శాతమే టు వేశారు.
– కోరుట్ల నియోజకవర్గంలో 2014లో 69 శాతం పోలింగ్ నమోదు కాగా, 2018లో 5 శాతం పెరిగి 75.84 శాతంగా నమోదైంది. ఈసారి కూడా 75.62 శాతం నమోదైంది.
– మంథని నియోజకవర్గంలో 2014లో 81.02 శాతం నమోదైంది. 2018లో 4 శాతం పెరిగింది. 85.41 శాతంగా నమోదైంది. ఈసారి మాత్రం 6 శాతం తగ్గి 79..14 శాతం నమోదైంది.
– పెద్దపల్లి నియోజకవర్గంలో 2014లో 75.97 శాతం నమోదు కాగా, 2018లో అత్యధికకంగా 9 శాతం పెరిగింది. 84.08 శాతం నమోదైంది. ఈసారి మాత్రం 3 శాతం తగ్గి 81.01 శాతం నమోదైంది.
– ఇక రామగుండం నియోజకవర్గంలో 61.91 శాతం నమోదు కాగా, 2018లో 71.94 శాతం నమోదైంది. ఈసారి 3 శాతం తక్కువగా 68.71 శాతం నమోదైంది.
– కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో 2014లో 73.68 శాతం నమోదుకాగా, 2018లో 2 శాతం పెరిగి 80.88 శాతం నమోదైంది. ఈసారి మాత్రం 6 శాతం తగ్గింది. 74.02 శాతమే నమోదైంది.
– దక్షిణ కాశీ వేములవాడ నియోజకవర్గంలో 2014లో 73.26 శాతం పనోలింగ్ నమోదు కాగా, 2018నాటికి ఏడు శాతం పెరిగి 80.62 శాతం నమోదైంది. ఇప్పుడు మాత్రం 2 శాతం తగ్గింది. 78.42 శాతంగా నమోదైంది.
– ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలో 2014లో 80.78 శాతం పోలింగ్ నమోదు కాగా, 2018లో 3 శాతం పెరిగింది. 83.94 శాతంగా నమోదైంది. 2023లో మాత్రం 5 శాతం తక్కువగా 78.75 శాతంగా నమోదైంది.