KTR: చాలా రోజుల తర్వాత కంటి నిండా నిద్రపోయా.. కేటీఆర్‌ !

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చాలా వరకు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌లో నర్వస్‌గా కనిపించారు. మీడియాతో కూడా పొడిపొడిగా మాట్లాడారు.

Written By: Raj Shekar, Updated On : December 1, 2023 4:31 pm

TS Election Results 2023

Follow us on

KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడ్డాయి. గురువారం 8 గంటల వరకు పోలింగ్‌ పూర్తయినట్లు ఈసీ ప్రకటించింది. అయితే సాయంత్ర 5:30 గటలకే ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కు ఎడ్జ్‌ ఇవ్వగా, రెండు మూడు సంస్థలు బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని తెలిపారు, రెండు సంస్థలు హంగ్‌ ఏర్పడుతుందని ప్రకటించాయి. అయితే ఎగ్జిట్‌పోల్‌స వెలువడిన తర్వాత బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఇందులో కాస్త అసహనంగానే కనిపించారు. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్‌ కొనసాగుతుండగానే, ఓటర్లు భారీగా క్యూలైన్లలో ఉన్నా.. ఈసీ ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలకు అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్‌ ఉన్నప్పటికీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఈసీ తీరును తప్పు పట్టారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాక్ట్‌ పోల్స్‌ కావని ప్రకటించారు.

అనుకూలంగా రాకపోవడంతో..
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చాలా వరకు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌లో నర్వస్‌గా కనిపించారు. మీడియాతో కూడా పొడిపొడిగా మాట్లాడారు. అనంతరం పార్టీ నేతలతో మాట్లాడారు. ఆ సమసయంలో కూడా అసంతృప్తిగా, అసహనంగా ఉన్నట్లు గులాబీ భవన్‌లో గుసగుజలు వినిపించాయి. ఓటమి ఖాయమైందా అన్న అభిప్రాయం వ్యక్తమయ్యాయి.

సోషల్‌ మీడియాలో ట్రోల్‌..
కేటీఆర్‌లో అసహనం, అసంతృప్తిపై గులాబీ నేతలతోపాటు, సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ కావడంతో కేటీఆర్‌ అప్రమత్తమయ్యారు. నైరాశ్యంగా ఉన్న గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు శుక్రవారం ఉదయమే సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘చాలా రోజుల తర్వాత కంటి నిండా నిద్రపోయాను. ఎగ్జిట్‌ పోల్స్‌ కేవలం హైప్‌ మాత్రమే.. ఎగ్జాక్ట్‌ పోల్స్‌ మనకు శుభవార్త చెబుతాయి’ అని పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం కనిపించినా.. లోలోపల మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా మంది మంత్రుల్లో కూడా ఇదే టెన్షన్‌ కనిపిస్తోంది. గెలుస్తామా ఓడుతామా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.