Varunreddy: ఒకప్పుడు పరిటార రవి హత్య కేసు ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ హత్యోదంతంలో నిందితులను అప్పటి అనంతపురం జైలులో ఉంచారు. ఈ క్రమంలోనే అందులో నిందితుడిగా ఉన్న మొద్దు శీను అప్రూవర్ గా మారి నిజాలు చెబతానని కోర్టుకు వివరించాడు. అయితే అతని విచారణ తేదీ రాకముందే.. అతన్ని ప్రకాష్ అనే వ్యక్తి జైల్లోనే మర్డర్ చేశాడు. ఏకంగా సిమెంట్ డంబెల్‌తో బాది దారుణంగా చంపాడు.
ఈ హత్య పెను దుమారమే రేపింది. ఎందుకంటే ఆ హత్య జరిగిన సమయంలో జైలు సూపరింటెండెంట్ లీవ్ పెట్టాడు. కాగా ఆయన బాధ్యతలను వరుణారెడ్డి నిర్వర్తించారు. ఈ వరుణారెడ్డినే ప్రకాశ్‌ను మొద్దు శీను సెల్‌లోకి పంపించాడనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఆయన ఎందుకు పంపించాడు.. మొద్దు శీను హత్య వెనక కారణాలేంటనేవి ఇప్పటికీ సమాధానాలు లేని ప్రశ్నలే.
కాగా ఈ ఆరోపణల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం వరుణారెడ్డిని సస్పెండ్ చేసింది. కాగా ఇన్ని రోజుల తర్వాత ఈయన పేరు మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కడప జిల్లా జైలుకు ఇన్ చార్జి సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. నిజానికి ఆయనకు ఆ అర్హత లేదు. అందుకే ఇన్ చార్జి హోదాలో జైలు బాధ్యతలు అప్పగించారు. మరి ఆయన బాధ్యతలు తీసుకుంటే ఏమవుతుంది అంటే.. ఇక్కడే అసలు కథ మొదలువతోంది.
Also Read: హాట్ టాపిక్ గా వరుణారెడ్డి పేరు.. వివేకా హత్య కేసు నిందితుల గుండెల్లో గుబులు..?
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు అయిన సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి లాంటి కీలక వ్యక్తులు ఇదే జైల్ లో ఉంటున్నారు. వరుణారెడ్డిక రీసెంట్ గా ప్రభుత్వం మెడల్ కూడా ఇచ్చింది. అసలు సస్పెండ్ అయిన వ్యక్తికి మెడల్ ఇవ్వడం ఏంటనేది పెద్ద ప్రశ్న. అది అలా ఉంచితే.. ప్రభుత్వం ఆయన్ను ఇదే జైలుకు ఏరికోరి ఎందుకు సూపరింటెండెంట్ గా నియమించింది అనేదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.
గతంలో పరిటాల రవి హత్య నిందితుల ఘటనను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మరోసారి అలాంటి సీన్ ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా అనే అనుమానాలకు తావిస్తోంది. కాగా వరుణారెడ్డి గురించి తెలిసిన వారంతా కూడా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: హైదరాబాద్ లో వీధికుక్కను వదలని కామాంధుడు.. శృంగారం చేస్తూ కెమెరా చేతికి చిక్కాడు