Afghanistan-Taliban Crisis: అమెరికా విమానంలో అప్ఘన్లు.. వైరల్ ఫొటో

అప్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. తాలిబన్లు దేశంలో అల్లకల్లోలం సృష్టించడంతో అప్ఘనిస్తాన్ అక్కడి వినాశకరమైన దృశ్యాలు, వీడియోలు భయం కొలిపే విధంగా ఉంటున్నాయి. తాజాగా కాబూల్ విమానాశ్రయంలో అప్ఘనిస్తానీయులు దేశం విడిచి వెళ్లేందుకు విమానాలు ఎక్కుతూ.. వాటిపై నుంచి పడిపోతూ కనిపించిన హృదయ విదారక దృశ్యాలు కలిచివేస్తున్నాయి. కాబూల్ విమాశ్రయంలో అప్ఘన్లు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కంటతడిపెట్టిస్తున్నాయి. తాజాగా మరో బీతావాహ దృశ్యం కనిపించింది. అమెరికాకు చెందిన మిలటరీ కాబూల్ విమానాశ్రయంంలో తమ భారీ […]

Written By: NARESH, Updated On : August 17, 2021 3:30 pm
Follow us on

అప్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. తాలిబన్లు దేశంలో అల్లకల్లోలం సృష్టించడంతో అప్ఘనిస్తాన్ అక్కడి వినాశకరమైన దృశ్యాలు, వీడియోలు భయం కొలిపే విధంగా ఉంటున్నాయి. తాజాగా కాబూల్ విమానాశ్రయంలో అప్ఘనిస్తానీయులు దేశం విడిచి వెళ్లేందుకు విమానాలు ఎక్కుతూ.. వాటిపై నుంచి పడిపోతూ కనిపించిన హృదయ విదారక దృశ్యాలు కలిచివేస్తున్నాయి. కాబూల్ విమాశ్రయంలో అప్ఘన్లు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కంటతడిపెట్టిస్తున్నాయి.

తాజాగా మరో బీతావాహ దృశ్యం కనిపించింది. అమెరికాకు చెందిన మిలటరీ కాబూల్ విమానాశ్రయంంలో తమ భారీ విమానాన్ని దించింది. అందులో అమెరికా పౌరులు, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అమెరికా విమానంలోకి అప్ఘనిస్తాన్ ప్రజలు పోటెత్తారు. ఆ యుద్ధ విమానంలోకి చొరబడి ఇరుకుగా దాదాపు 600 మంది కూర్చున్న చిత్రం వైరల్ అవుతోంది.

అప్ఘన్ ప్రజలు పురుషులు, మహిళలు, పిల్లలతో సంబంధం లేకుండా ఒకరినొకరు తోసుకుంటూ ఇరుకిరుకిగా ఉన్న చిత్రాలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. ఎలాంటి భద్రత, భరోసా లేని దేశంలో ఉండలేమంటూ వారు పొట్ట చేత పట్టుకొని అమెరికా విమానంలో కూర్చున్న ఫొటో ప్రస్తుతానికి వైరల్ అవుతోంది.

ఇంతటి దుర్భర పరిస్తితుల్లో ఉన్న అప్ఘనిస్తాన్ వాసులను ఆదుకునేందుకు ఏ దేశం కూడా ముందుకు రాకపోవడం విచారకరమనే చెప్పాలి. ఇక భారతదేశం మాత్రం అప్ఘనిస్తాన్ పౌరులకు వీసాలకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అక్కడి హిందూ, సిక్కు అప్ఘన్ల కోసం కొత్త వీసా వ్యవస్థను రూపొందించింది. శరణార్థులను భారత్ కు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.