https://oktelugu.com/

Chaitra Rai Blessed With Baby Girl: ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి !

ప్రముఖ బుల్లితెర హీరోయిన్ ‘చైత్రా రాయ్'(Chaitra Rai) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ మధ్య తాను తల్లి కాబోతున్నాను అని చైత్రా ప్రేక్షకులకు తెలియజేయగానే.. ఆమె నుండి తీపి కబురు కోసం ఆమె ఫాలోవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా ఈ నేపథ్యంలో చైత్రా సోమవారం ఉదయం పండంటి ఆడబిడ్డను జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో బేబీ ఫొటోను పోస్ట్ చేస్తూ… ‘ఇట్స్‌ ఏ బేబీ గర్ల్‌.. నా జీవితంలో నేను ఎన్నడూ ఇంత […]

Written By:
  • admin
  • , Updated On : August 17, 2021 / 03:51 PM IST
    Follow us on

    ప్రముఖ బుల్లితెర హీరోయిన్ ‘చైత్రా రాయ్'(Chaitra Rai) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ మధ్య తాను తల్లి కాబోతున్నాను అని చైత్రా ప్రేక్షకులకు తెలియజేయగానే.. ఆమె నుండి తీపి కబురు కోసం ఆమె ఫాలోవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా ఈ నేపథ్యంలో చైత్రా సోమవారం ఉదయం పండంటి ఆడబిడ్డను జన్మనిచ్చింది.

    ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో బేబీ ఫొటోను పోస్ట్ చేస్తూ… ‘ఇట్స్‌ ఏ బేబీ గర్ల్‌.. నా జీవితంలో నేను ఎన్నడూ ఇంత గొప్ప అనుభూతి చెందలేదు. మా చిన్నారి రాకతో మా కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు’ అంటూ ఆమె తన సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.

    ఇక ‘చైత్రా రాయ్’ పోస్టుకు మరో బుల్లితెర నటి సుష్మ, మంజు, అలాగే యాంకర్‌ విష్ణు ప్రియ మరియి ఇతర నటీనటులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చైత్రా రాయ్’ ‘ఒకరికి ఒకరు’, ‘మనసున మనసై’, ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ’ వంటి పలు సీరియల్స్‌ లో నటించి మెప్పించారు. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులలో ఎందరో అభిమానులుగా మారారు.

    అయితే ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ అనే సీరియల్‌ లో నటిస్తూ మధ్యలోనే ఆమె ఆ సీరియల్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సీరియల్ నుండి తప్పుకోవడానికి ముఖ్య కారణం.. తల్లి కాబోతున్న క్షణాలను ఆస్వాదించాలనే. మరి ఇప్పుడు మళ్లీ ఆమె తిరిగి ఆ సీరియల్ లో నటిస్తోందా ? లేదా ? అనేది చూడాలి.

    సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే చైత్రా రాయ్ పలు క‌న్న‌డ సీరియ‌ల్స్‌ లో కూడా న‌టించింది. ఆమెకు కన్నడంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.