Pollution In Vijayawada: ఏదైనా తనదాకా వస్తే గానీ తెలియదంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగింది కూడా అదే. సాక్షాత్తు సీఎంకే శ్వాస తీయలేని ఇబ్బంది ఏర్పడిన క్రమంలో ఆయన మురుగు నీటి కాల్వలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖాధికారులను పిలిపించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రజల బాధకు కాస్త ఉపశమనం కలిగినట్లు అయింది.

విజయవాడ కాలుష్య సెగలో కాగుతోంది. దీనిపై ప్రజలు ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోని అధికారులు సీఎం జగన్ చెప్పడంతో ఉరుకులు పరుగులు పెట్టారు. సీఎంవో అధికారులు దుర్వాసనకు కారణమైన కాల్వల్ని పరిశీలించి తక్షణ చర్యలకు ఉపక్రమించారు. సీఎం నివాసం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాలున్నాయి. ఇవి మొత్తం కాలుష్యం కోరల్లో చిక్కుకుని అధ్వానంగా మారాయి. ఈ నేపథ్యంలో జగన్ ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వస్తున్న క్రమంలో దుర్వాసన వెదజల్లడంతో బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ఉక్కిరిబిక్కిరి అయి కాల్వలను బాగు చేయాలని సూచించారు.
సీఎం జగన్ గురించి తెలిసిన వారు ఎవరైనా ఆయన ఆగ్రహానికి గురి కావద్దని కోరుకుంటారు. కానీ కాలుష్యం సెగ వారిని జగన్ కోపానికి కారణమైంది. దీంతో వారిపై జగన్ విరుచుకుపడ్డారు. ఇంత దుర్వాసన వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని ఇప్పటికైనా జగన్ కు అర్థం కావడంతో ప్రజలకు మేలే జరిగిందని చెబుతున్నారు. కాల్వలు శుభ్రం చేయడంతో హర్షం వ్యక్తం అవుతోంది.
విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వెదజల్లుతున్న కాలుష్యంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారికి ఇరువైపుల వస్తున్న దుర్వాసనతో జనం పడుతున్న ఇబ్బందుల్ని తీర్చే క్రమంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిశ్రమలపై వచ్చే వ్యర్థాలపై కూడా వేటు పడే అవకాశం కనిపిస్తోంది.
Also Read: కొత్తగా ఎంపికైన ఎమ్మెల్సీ బ్యాక్ గ్రౌండ్ చూద్దామా?