Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ” పుష్ప”. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా … మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరు కలిసి ఈ మూవీ తెరకెక్కిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులకు ఓ అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించారు.

ఈ సినిమా ఫోర్త్ సింగిల్ ప్రోమోను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” అంటూ సాగే ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తన స్టెప్పులతో అదర గొట్టాడు అని చెప్పాలి. ఇక ఈ సాంగ్ ఫుల్ వీడియోను నవంబర్ 19 వ తేదీ ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు పుష్ప టీం వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా తొలి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 వ తేదీన విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి సామి’, పాటలు అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. కన్నడ నటుడు ధనుంజయ, అజయ్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.