Actress Bhumika: యువకుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు భూమిక. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో “ఖుషి ” సినిమాలో నటించి స్టార్ రేంజ్ కి ఎదిగిపోయింది ఈ భామ. తెలుగు, తమిళ, హిందీ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు పొందారు ఈ బ్యూటీ. నటన పరంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు భూమిక. అయితే వివాహం అనంతరం సినిమాలకు కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఇటీవలే నాని నటించిన “మిడిల్ క్లాస్ అబ్బాయి” తో మళ్ళీ సినిమాలో రీ-ఎంట్రీ ఇచ్చారు భూమిక.

రీఎంట్రీ అనంతరం అక్క, తల్లి , వదిన వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో అలరించారు భూమిక. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌కు బూస్టప్ లేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం భూమిక ఎక్కువగా సెలబ్రిటీస్ పార్టీలకు వెళ్లారని అందువల్ల అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని సమాచారం వినిపిస్తుంది. అయితే భూమిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. పార్టీలకు వెళితే మంచి పాత్రలు వస్తాయా, అలాంటి మాటలను నేను పట్టించుకోనని తెలిపారు. ఫిల్మ్ మేకర్స్‌తో రోజూ టచ్‌లో ఉంటేనే అవకాశాలు వస్తాయన్నది పిచ్చితనం అని చెప్పుకొచ్చారు. అయితే నా కోసం ముంబై వచ్చిన మేకర్స్ చాలా మంది ఉన్నారు అని అన్నారు భూమిక.
ప్రస్తుతం భూమిక 90 మినిట్స్ సినిమా, మూడు తమిళ చిత్రాలలో నటిస్తుంది భూమిక. తెలుగులో కూడా భూమిక కొత్త ప్రాజెక్ట్ లను వింటున్నారని సమాచారం. రానున్న రోజుల్లో మళ్ళీ వరుస ఆఫర్లతో భూమిక బిజీగా మారాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.