Vijaysai Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైసిపి టార్గెట్ చేసింది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి అదేపనిగా పురందేశ్వరి పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అది వ్యూహాత్మకమా? వ్యూహమా? అన్నది తెలియాల్సి ఉంది. పురందేశ్వరి తెలుగుదేశం పార్టీ మనిషి అని.. “బావ” సారూప్య పార్టీలతో సంబంధాలు కలిగి ఉన్నారని లేనిపోని ఆరోపణలు చేస్తూ వచ్చారు. బిజెపి అగ్ర నేతలకు అనుమానం వచ్చేలా విజయసాయి రెడ్డి పురందేశ్వరి పై ఆరోపణలు చేయడం విశేషం.
అయితే ఇంత జరుగుతున్నా పురందేశ్వరికి జాతీయ నాయకత్వం నుంచి కానీ, రాష్ట్ర బిజెపి నుంచి కానీ అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించడం లేదు. విజయసాయి రెడ్డి సైతం తాను ఒక బిజెపి నేత మాదిరిగా.. ఆ పార్టీ శ్రేయోభిలాషి అన్న తరహాలో పురందేశ్వరి పై విమర్శలు చేస్తుండడం విశేషం. టిడిపికి పురందేశ్వరి మద్దతు తెలుపుతున్నారన్న కోణంలోనే తరచూ ఆయన మాట్లాడుతున్నారు. వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేయడం అంటే.. టిడిపికి మద్దతు తెలపడమే అన్న రీతిలో విజయసాయిరెడ్డి భావన ఉంది. అయితే దానిని అనుకున్న స్థాయిలో రాష్ట్ర బిజెపి నాయకులు అడ్డుకోకపోవడం విశేషం.
రాష్ట్ర బిజెపిలో వర్గ పోరు తగ్గడం లేదు. ఇప్పటికీ ప్రోవైసిపి, ప్రో టిడిపి వర్గాలు కొనసాగుతున్నాయి. పురందేశ్వరి నియామకంతో టిడిపికి చెబుతారని అంతా ఆశించారు. కానీ ఆమె అందుకు విరుద్ధంగావైసీపీ సర్కార్ పై గట్టిగానే పోరాడుతున్నారు.తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇది వైసీపీ నేతలతో పాటు బిజెపిలో కొనసాగుతున్న ప్రో వైసిపి నేతలకు మింగుడు పడడం లేదు. అటు పురందేశ్వరి చర్యలు సైతం టిడిపికి మేలు చేసేలా ఉన్నాయి. అందుకే ఆమె అందరికీ టార్గెట్ అవుతున్నారు. రాయలసీమకు చెందిన కొంతమంది నేతలు అసంతృప్తి గళం వినిపించడంతో ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే విజయసాయి రెడ్డి రూపంలో ఎదురవుతున్న విమర్శలను మిగతా బిజెపి నేతలు ఆశించిన స్థాయిలో తిప్పి కొట్టడం లేదు.
ఎన్నికల ముంగిట బిజెపిలో ఒకరకమైన అయోమయాన్ని క్రియేట్ చేయాలన్నది విజయసాయిరెడ్డి లక్ష్యం. ఇందుకుగాను బిజెపిలోని వైసీపీ టీం ను ఆయన లీడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారితో పురందేశ్వరిపై ఫిర్యాదులు చేయిస్తున్నట్లు సమాచారం. కానీ బిజెపి హై కమాండ్ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో బిజీగా ఉంది. ఇటువంటి తరుణంలో విజయసాయిరెడ్డి విమర్శల డోసు పెంచారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలపాలని చంద్రబాబుకు పురందేశ్వరి సలహా ఇచ్చారని సెటైర్లు వేస్తున్నారు. బిజెపి అగ్ర నేతల ఎదుట పురందేశ్వరినిబలహీనం చేయడమే లక్ష్యంగా విజయసాయిరెడ్డి పావులు కదుపుతున్నారు.మరి దీనిని ఆమె ఎలా అధిగమిస్తారో చూడాలి.