TDP: ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ మాఫియా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల్లో విభేదాలు లేపిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. గాలికి పోయే కంప దేనికో తగిలినట్లు ప్రస్తుతం పార్టీల మెడకు చుట్టుకుంటోంది. టీడీపీ చల్లిన బురదలో అదే పడబోతోంది. ఎవరు తోడుకున్న బొందలో వారే పడతారు అన్నట్టుగా ఇప్పుడు వ్యవహారం కాస్త టీడీపీని ఇరకాటంలో పెట్టబోతోంది. గతంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడిన ఓ వీడియోను విజయసాయిరెడ్డి పోస్టు చేసి దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

టీడీపీ జగన్ సర్కారు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో ప్రస్తుతం విజయసాయిరెడ్డి టీడీపీని టార్గెట్ చేశారు. గతంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడిన వ్యాఖ్యలతో సహా వీడియోను పోస్టు చేయడంతో గంజాయి సాగుపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ హయాంలో గంటా ఓ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను బహిర్గతం చేశారు.
దీంతో ఏపీలో గంజాయి, డ్రగ్స్ వ్యవహారం ఓ సంచలనానికి కేంద్ర బిందువుగా మారిపోయాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ వైఖరిపై రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించాలని కోరారు. దీనిపై రాష్ర్టపతి కూడా సానుకూలంగా స్పందించారని టీడీపీ చెబుతోంది.
ఇదిగో టీడీపీ నిజస్వరూపం. టీడీపీ హయాంలో అప్పటి మంత్రి గంటా ఒక ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి లోకేష్ నాయకత్వంలో అయ్యన్న, వెలగపూడి, అప్పటి విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ల గంజాయి వ్యాపార భాగస్వామ్యం గురించి గంట మోగించారో లేక బాబు పాత్రపై అనుమానమో కానీ విషయం మాత్రం ఇది. pic.twitter.com/M6O80eZ0ot
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 25, 2021
గంజాయి వాడకంపై టీడీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో రెండు పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గంజాయి వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రాష్ర్టంలో గంజాయి వినియోగంపై గొడవలు తారాస్థాయికి చేరడం గమనార్హం.