https://oktelugu.com/

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యే వ్యక్తి అతనేనా?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ప్రస్తుతం నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్లు, ఎనిమిది మంది మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ఇంటి సభ్యులలో మానస్, షణ్ముఖ్ జశ్వంత్, సిరి హన్మంత్, శ్రీరామచంద్ర, లోబో, రవి ఉన్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కొన్ని వారాల పాటు బిగ్ బాస్ హౌస్ నుంచి ఫిమేల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 26, 2021 / 01:59 PM IST
    Follow us on

    బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ప్రస్తుతం నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్లు, ఎనిమిది మంది మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ఇంటి సభ్యులలో మానస్, షణ్ముఖ్ జశ్వంత్, సిరి హన్మంత్, శ్రీరామచంద్ర, లోబో, రవి ఉన్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కొన్ని వారాల పాటు బిగ్ బాస్ హౌస్ నుంచి ఫిమేల్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసే పరిస్థితి లేదు.

    ఎలిమినేషన్ కు నామినేట్ అయిన కంటెస్టెంట్లలో వీక్ కంటెస్టెంట్ లోబోనే కావడంతో అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకపోవడంతో బిగ్ బాస్ షో రేటింగ్స్ పుంజుకునే అవకాశాలు కూడా దాదాపుగా కనిపించడం లేదనే చెప్పాలి. బిగ్ బాస్ షో రొటీన్ గా సాగిపోతుందని టాస్కులు సైతం ఈ షోలో కొత్తగా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి.

    బిగ్ బాస్ నిర్వాహకులు ఇకపై ఈ షో విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళతారో చూడాల్సి ఉంది. మరోవైపు నాగార్జున హోస్ట్ చేస్తున్న ఎపిసోడ్స్ కు మాత్రమే అంతోఇంతో రేటింగ్స్ వస్తున్నాయి. నాగార్జునకు ఈ షో హోస్ట్ చేయడానికి పెద్దగా ఆసక్తి లేదు. విష్ణుప్రియతో పాటు మరి కొందరు హీరోయిన్ల పేర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ జాబితాలో వినిపిస్తున్నా ఆయా సెలబ్రిటీలకు బిగ్ బాస్ షోపై పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది.

    బిగ్ బాస్ షో సీజన్ 5లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు తప్ప గత సీజన్లలా లవ్ ట్రాక్ లేదు. లహరి షారా, హమీదా లాంటి మంచి కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడంతో ఒక వర్గం ప్రేక్షకులలో ఈ షోపై ఆసక్తి తగ్గడం గమనార్హం.