Vijay Mallya Son: విజయ్ మాల్యా కొడుకు వివాహం.. ఇంతకీ పెళ్లికూతురు ఎవరంటే..

Vijay Mallya Son: విజయ్ మాల్యా కు ఏకైక సంతానం సిద్ధార్థ మాల్యా. గతంలో ఇతడు బాలీవుడ్ నటిమణి దీపికా పదుకొనేతో సన్నిహితంగా మెలిగేవాడు. అప్పట్లో ఐపీఎల్ బెంగళూరు జట్టు ఫ్రాంచైజీ దక్కించుకున్నప్పుడు..

Written By: Anabothula Bhaskar, Updated On : June 18, 2024 11:52 am

Vijay Mallya Son To Marry his longtime girlfriend Jasmine

Follow us on

Vijay Mallya Son: ఆర్థిక నేరాల అభియోగాలు ఎదుర్కొంటూ.. దేశం విడిచి పారిపోయిన ప్రఖ్యాత వ్యాపారవేత్త విజయ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన స్నేహితురాలు మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా తన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రకటించాడు..” ఆనందంగా ఉంది. నా జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశిస్తున్నారు.. ఈ శుభ సందర్భాన్ని మీతో పంచుకుంటున్నాను. పెళ్లి వారం మొదలైంది” అంటూ రాసు కొచ్చాడు. తనకు కాబోయే సతీమణి చిత్రాన్ని కూడా సిద్ధార్థ మాల్యా సామాజిక మాధ్యమాలలో షేర్ చేశాడు. ఒకరిని ఒకరు గాఢంగా హత్తుకొని.. ఫ్లవర్ ఫ్రేమ్ లో ఇచ్చిన ఫోజ్ ను అతడు పోస్ట్ చేశాడు.

Also Read: Hindu kings : ముస్లిం యువరాణిలను వివాహం చేసుకున్న హిందూ రాజులు వీరే

విజయ్ మాల్యా కు ఏకైక సంతానం సిద్ధార్థ మాల్యా. గతంలో ఇతడు బాలీవుడ్ నటిమణి దీపికా పదుకొనేతో సన్నిహితంగా మెలిగేవాడు. అప్పట్లో ఐపీఎల్ బెంగళూరు జట్టు ఫ్రాంచైజీ దక్కించుకున్నప్పుడు.. సిద్ధార్థ వెంట దీపిక ఉండేది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని మీడియా కోడై కూసేది. దానికి తగ్గట్టుగానే వీరిద్దరి ప్రవర్తన ఉండేది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ దీపిక సిద్ధార్థతో దూరం జరిగింది. రణ్ బీర్ కపూర్ కు దగ్గరయింది. ఆ బంధం కూడా విడాకులు కావడంతో రణ్ వీర్ సింగ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం దీపిక గర్భవతి..

Also Read: Sam Pitroda: ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఈసీ.. కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు!

ఇక సిద్ధార్థ తన తండ్రి చేసిన ఆర్థిక నేరాల వల్ల ఇండియాకు రావడం మానేశాడు. అతడు లండన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 2023 హాలోవిన్ రోజున తన స్నేహితురాలు జాస్మిన్ కు లవ్ ప్రపోజ్ చేశాడు.. దీనికి ఆమె ఒప్పుకుంది. జాస్మిన్ మాజీ మోడల్. తనకు సిద్ధార్థ ప్రపోజ్ చేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.. ఆ సమయంలో సిద్ధార్థ ఆమె చేతి వేలికి ఉంగరం తొడిగి.. మోకాళ్లపై నిల్చుని లవ్ ప్రపోజ్ చేశాడు. సిద్దార్థ గతంలో సినిమాల్లో నటించాడు. అతడు మానసిక ఆరోగ్యం పై రెండు పుస్తకాలు రాశాడు. ఆ తరువాత “ది హంట్ ఫర్ ది కింగ్ ఫిషర్ గర్ల్ -13” పోటీల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.