భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిండు సభలో ఏడ్చేశాడు. రాజ్యసభ సాక్షిగా కంటతడి పెట్టాడు. ఆయన ప్రసంగిస్తూ ఇలా సభకు ఇన్ని రోజులు అంతరాయం కలుగడం.. ఎంపీల అనుచిత ప్రవర్తనతో ఆగిపోవడంపై గుక్కపెట్టినట్టుగా వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ రాజ్యసభలో ఏడ్వడం అందరినీ కలిచివేసింది.
ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు ప్రసంగం మొదలుపెట్టారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం అయిన పార్లమెంట్ లో కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని.. టేబుళ్లపై నిలుచుంటున్నారని.. పోడియం ఎక్కుతున్నారని’ వెంకయ్య వాపోయారు. పార్లమెంట్ పోడియం వద్ద నిరసన తెలుపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లేనని వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు.
సభలో ఇన్నిరోజులు కార్యకలాపాలు స్తంభించడం మంచిది కాదని వెంకయ్య ఏమోషనల్ అయ్యారు. కంటతడి పెడుతూ ప్రసంగం మధ్యలో ఆగి ఎమోషన్ ను కంట్రోల్ చేసుకున్నారు.
రాజ్యసభలో రైతుల సమస్యను చర్చిస్తుండగా కొందరు ఎంపీలు నల్లని వస్త్రాలను ఊపుతూ పత్రాలను విసిరేస్తూ ఏకంగా వెంకయ్య కూర్చున్న దిగువన టేబుల్స్ ఎక్కి నిలుచుండి గంటన్నరసేపు బైఠాయించారు. ఈ హాఠాత్ పరిణామానికి వెంకయ్య నొచ్చుకొని ఇలా కంటతడి పెట్టినట్టుగా తెలుస్తోంది. కానీ ఇంత పెద్ద పార్లమెంట్ లో సభ జరగక వెంకయ్య కంటతడి పెట్టుకోవడం.. అధికార బీజేపీ అవలంభిస్తున్న తీరే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు.
ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై స్పందించి వారిని శాంతింప చేసేందుకు బీజేపీ ఏమాత్రం చొరవ చూపకపోవడమే ఈ ఉపద్రవాలకు కారణమన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ తీరుతో ఇప్పుడు రాజ్యసభలో వెంకయ్య ఇలా కంటతడి పెట్టుకున్నారని అంటున్నారు.
వెంకయ్య ఏడ్చేసిన వీడియో..