Telugu News » National » Debate in the rajya sabha on the constitutional amendment bill
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ
127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ మొదలైంది. ఈ బిల్లుకు మంగళవారం లోక్ సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రాలకు ఓబీసీ కోటా విషయంలో అధికారాలు ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో చర్చ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన ప్రశ్నోత్తరాలు, భోజన విరామ సమయాన్ని రద్దు చేశారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడంలేదని, చర్చ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించినా ఇబ్బంది లేదని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు.