https://oktelugu.com/

Vande Bharat Express : ‘గేదెలు’ గుద్దితే వందే భారత్ ట్రెయిన్ ఫట్.. ఇదీ ఫాస్ట్ ట్రెయిన్ క్వాలిటీ

Vande Bharat Express : గంటకు 180 కి.మీల వేగం.. దేశంలోనే అత్యాధునిక అత్యంత వేగంగా ప్రయాణించే ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ రైళ్లను ప్రారంభించిన మోడీ సర్కార్ ఘనంగా జబ్బలు చరుచుకుంది. కానీ కేవలం  గేదెలను ఢీకొంటే ఆ రైలు ముందు భాగం పచ్చడి అయిపోయి పగిలిపోవడం చూసి నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇదేనా సార్ అత్యాధునిక రైలు క్వాలిటీ’ అంటూ దెప్పిపొడుస్తున్నారు. వసతులు సరే గేదెలకు డీకొంటేనే ఇలా అయితే ఇంకా పెద్ద […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2022 / 08:21 PM IST
    Follow us on

    Vande Bharat Express : గంటకు 180 కి.మీల వేగం.. దేశంలోనే అత్యాధునిక అత్యంత వేగంగా ప్రయాణించే ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ రైళ్లను ప్రారంభించిన మోడీ సర్కార్ ఘనంగా జబ్బలు చరుచుకుంది. కానీ కేవలం  గేదెలను ఢీకొంటే ఆ రైలు ముందు భాగం పచ్చడి అయిపోయి పగిలిపోవడం చూసి నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇదేనా సార్ అత్యాధునిక రైలు క్వాలిటీ’ అంటూ దెప్పిపొడుస్తున్నారు. వసతులు సరే గేదెలకు డీకొంటేనే ఇలా అయితే ఇంకా పెద్ద ప్రమాదం జరిగితే రైలు తుక్కుతుక్కు అవుతుందంటూ దెప్పిపొడుస్తున్నారు. సౌకర్యాలు సరే నాణ్యతతో చేయలేదా? అంటూ హితవు పలుకుతున్నారు.

    మోడీ వచ్చాక టెక్నాలజీకి ప్రాధాన్యత పెరిగింది.. 4జీ నుంచి 5జీకి వచ్చింది. ఇక జనాల అవసరాన్ని గుర్తించిన మోడీ సర్కార్ మన మూస బ్రిటీష్ వారి కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునీకరించింది. ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ అంటూ ఆధునిక ట్రెయిన్ లను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ముంబై టు గుజరాత్ లోని గాంధీనగర్ కు ఈ సెమీ హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టారు. ఈ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ గాంధీనగర్ నుంచి కాలుపూర్ రైల్వే స్టేషన్ వరకూ ప్రయాణించారు.

    ఈ అత్యాధునిక రైలులో ఆధునిక వసతులు చూసి ఆహో ఓహో అంటూ బీజేపీ నేతలు జబ్బలు చరుకున్నారు. సౌకర్యాల ఫొటోలను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

    తాజాగా ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్ లోని గాంధీనగర్ కు వస్తున్న ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ప్రమాదానికి గురైంది. గుజరాత్ లోని వాత్వా స్టేషన్ దగ్గర గురువారం ఉదయం 11.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. గేదెల గుంపు అడ్డం రావడంతో లోకో పైలెట్ సడెన్ గా బ్రేక్ వేశారు. దీంతో గేదెలను ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులకు ఏ ప్రమాదం జరగకపోవడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

    ఈ ప్రమాదం జరిగినప్పుడు రైలు 100 కి.మీల వేగంగా ప్రయాణిస్తోంది. 180 కి.మీల వేగంతో వెళ్లే రైలు 100 కి.మీల వేగానికే ఇంజిన్ ముందు భాగం ధ్వంసం అయ్యిందంటే ఈ రైలు నాణ్యత అర్థం చేసుకోవచ్చని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైలు ఇంజన్ నాణ్యతపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మన బ్రిటీష్ కాలం నాటి రైలుకు మనం గుద్దుకున్నా.. అది గుద్దినా చెక్కుచెదరదు.. వాటి నాణ్యత పటిష్టంగా ఉంటుంది. ముందు రెండు పెద్ద రాడ్ లు ఉంటాయి. కానీ వందే భారత్ ట్రెయిన్ ఇలా గేదెలు ఢీకొంటే ఇలా ముందుభాగం విరిగిపోవడం చూసి మోడీ సర్కార్ పై మీమ్స్, ట్రోల్స్ తో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.