Homeజాతీయ వార్తలుఉపరాష్ర్టపతినే టార్గెట్ చేసిన ట్విటర్?

ఉపరాష్ర్టపతినే టార్గెట్ చేసిన ట్విటర్?

ట్విటర్ ఇప్పుడు వార్తల్లో ప్రాచుర్యం పొందుతోంది. ప్రభుత్వమే లక్ష్యంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా భారత ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు ట్విటర్ ఖాతాకు బ్లూ టిక్ తీసేసింది. అంతలోనే తేరుకుని గంటల వ్యవధిలోనే పునరుద్ధరించింది. అసలు ఎందుకు తీసేసినట్లు, మళ్లీ ఎందుకు టిక్ మార్క్ పెట్టినట్లు అనే చర్చ ప్రారంభమైంది.

ట్విటర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. భారతదేశ ద్వితీయ పౌరుడిగా అకౌంట్ కే బ్లూ టిక్ తీసేయడం సమర్థనీయం కాదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వివరణ మాత్రం మరోలా ఉంది. వెంకయ్య నాయుడు చివరిసారిగా ట్వీట్ చేసిన జులై 23, 2020న ఉంది. దాదాపుగా ఏడాదిగా ఖాతా ఇన్ యాక్టివ్ గా ఉంది. అందుకే దానికి బ్లూ టిక్ తీసేశామంటున్న ట్విటర్ వర్గాలు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అకౌంట్ కి కూడా బ్లూ టిక్ తీసేసిన ట్విటర్ దాన్ని మాత్రం పునరుద్ధరించలేదు. మోహన్ భగవత్ ట్విటర్ అకౌంట్ కి 212.6కె మంది అనుసరిస్తున్నారు. అయినా దాన్ని అఫీషియల్ అకౌంట్ గా గుర్తించలేదు. ట్విటర్ ఎక్కువ కాలంగా ఎలాంటి ట్వీట్లు లేకపోవడంతో బ్లూ టిక్ తొలగించారు.విచిత్రం ఏంటంటే ఇది జరిగిన కొన్ని గంటలకే ఆయన తన ట్వీట్లు డిలిట్ చేశారు.

ప్రస్తుతం బీజేపీ నేతలు ఈ విషయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉపరాష్ర్టపతి అకౌంట్ కి బ్లూటిక్ తీసేసి భారత రాజ్యాంగాన్ని ట్విటర్ అవమానించిందని బీజేపీ అధికార ప్రతినిధి నకువా విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. భారత రాజ్యాంగానికి, బ్లూ టిక్ కు ఏంటి సంబంధమో ఆయనకే తెలియాలి. మరోసారి ట్విటర్ తన వ్యవహార శైలితో భారత్ లో కలకలం రేపింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version