Game changer : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు గుర్తుండిపోయే ఒకే ఒక్క పేరు మెగాస్టార్ చిరంజీవి…తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరో వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకొని మెగా ఫ్యామిలీని కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో భారీ సినిమాలు చేస్తూ తనదైన రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. చిరంజీవి తనయుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వరసగా భారీ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇక గ్లోబల్ స్టార్ గా అవతారం ఎత్తిన ఆయన ఈ సినిమాతో మరింత గుర్తింపును అందుకోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు చేయబోయే సినిమాలతో ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. బాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కానీ రేంజ్ లో మన హీరోలు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రామ్ చరణ్ కూడా ఈ సినిమాతో మరోసారి 1000 కోట్ల మార్క్ ను అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సోలో హీరోగా పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు.
‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికి ఆ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా హీరోగా చేశాడు. కాబట్టి ఆ సక్సెస్ అనేది ఇద్దరికి సమపాలల్లో దక్కుతుంది. ఇప్పుడు సోలో హీరోగా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక గేమ్ చేంజర్ సినిమా కోసం దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించారు. మరి ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్లను రాబడితే తప్ప ఈ సినిమాకి భారీ లాభాలు అయితే రావు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాని లాంగ్ రన్ లో 1000 కోట్లు వచ్చే విధంగా శంకర్ ఇందులో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను దండిగా పెట్టినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తనదైన రీతిలో సత్తా చాటుతున్న ఈ మెగా పవర్ స్టార్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటేనే తన మార్కెట్ అనేది భారీగా విస్తరిస్తుంది. లేకపోతే మాత్రం భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడం కష్టమవుతుందనే చెప్పాలి…