Amit shah Modi: వర్ధమాన రాజకీయాల్లో ఓటమెరుగని నేత ప్రధాని నరేంద్రమోడీ. గుజరాత్ సీఎంగా ఆయన గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఆయన నిర్ణయాలు.. పథకాలు, ప్రసంగాలు అన్నీ జనాల్లో మోడీపై అభిమానాన్ని పెంచాయి.. పెంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఆయన సీక్రెట్స్ ఏంటనేది ఆయన అత్యంత సన్నిహితుడైన కేంద్రహోంమంత్రి, గుజరాత్ కే చెందిన నేత బయటపెట్టాడు. ఆ ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

ఒక రూలర్ లా అటు కేంద్రమంత్రులను.. ఇటు అధికార యంత్రాగాన్ని మొత్తం తన గ్రిప్ లో పెట్టుకొని అసమ్మతి అనేది లేకుండా మోడీ ఏకపక్షంగా వ్యవహరిస్తారనే విమర్శలు ఉన్నాయి. మోడీ నిర్ణయాలపై ఇప్పటివరకు బీజేపీలో గొంతెత్తిన వారు లేరు. బీజేపీ పెద్దలు అద్వానీ, మురళీ మనోహర్ జోశి , ఉమాభారతి, తాజాగా మేనకాగాంధీ, వరుణ్ గాంధీలను సైతం పక్కనపెట్టి వారు ఏం మాట్లాడకుండా చేసిన ఘనత మోడీ సొంతం.
ఈ క్రమంలోనే మోడీ ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బయటపెట్టారు. మోడీలాంటి శ్రోతను నేనెప్పుడూ చూడలేదు. ఏ సమావేశంలో అయినా అతి తక్కువ మాట్లాడుతారు. ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఓపికగా వింటారు. విషయ పరిజ్క్షానం ఆధారంగా ప్రతి వ్యక్తి సూచనలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు’’ అని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మోదీపై ఎన్నో నిందలు మోపినా ఆయన అన్నింటిని అధిగమించారని ప్రతిపక్షాలనే ఆయనను మరింత బలవంతుడిని చేశాయని అమిత్ షా సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాల వల్ల దేవఆనికి ఉపయోగం కలిగింది. కొన్ని విషయాల్లో పొరపాట్లు జరిగినా ప్రజలు తమను క్షమించారు అని అమిత్ షా తెలిపారు.
మోడీ రాజకీయ జీవితాన్ని మూడు భాగాలుగా అమిత్ షా వర్ణించారు. మొదటిది ప్రారంభరోజులు అని.. రెండోది గుజరాత్ సీఎం అని.. మూడోది ప్రధానిగా పాలన జాతీయ రాజకీయాలు అని పేర్కొన్నాడు. ఇక రైతుల ఉద్యమాలు, ఆందోళనలు అర్థం లేనివి అని వ్యాఖ్యానించారు. సాగుచట్టాలు రైతులకు మేలు చేసేవేనన్నారు.