Nagababu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి మెగాఫ్యామిలీ అండగా నిలబడింది. నాగబాబు ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. కానీ చివరకు ప్రకాష్ రాజ్ ని బలిపశువు అయ్యాడు. ప్రకాష్ రాజ్ ని ఎగదోసింది మెగా కుటుంబమే. పైగా మా ఎన్నికలు ఇంత పోటాపోటీగా జరగడానికి కారణం కూడా మెగా ఫ్యామిలీనే. మరీ ఇంత చేసి.. చివరకి మెగా కుటుంబంలోని ఓట్లు కూడా వేయించలేకపోయారు అంటే ఏమనుకోవాలి ?

మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా ఓటింగ్ కి రాలేదు. మంచు విష్ణు పై కోట పై అడ్డమైన తిట్లుతో విరుచుకుపడిన నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ ను కూడా ఓటింగ్ కి తీసుకురాలేకపోయాడు. మొత్తానికి ప్రకాష్ రాజ్ బుక్ అయ్యాడు. అయితే, ఇలా దెబ్బెయ్యటం నాగబాబుకు కొత్తేమీ కాదు లేండి. సరే ఇంత చేసి.. చివరకు నాగబాబు ఏమి చేశాడు ?
‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో దిక్కుమాలిన ఆరోపణలు కూడా చేశాడు. ‘ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు – మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఇక సెలవు అంటూ నాగబాబు వివరణ ఇచ్చారు. నా రాజీనామా పత్రాన్ని అసోసియేషన్ కు 48గంటల్లో నా స్టాఫ్ ద్వారా అందజేస్తాను. ఇది నేను ఎంతగానో ఆలోచించి , ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం’ అంటూ నాగబాబు మెసేజ్ పెట్టాడు.
అసలు కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటుడిని రేపో మాపో ఊడిపోతాడు లాంటి చీప్ వ్యాఖ్యలు చేసిన నాగబాబుకి, సంకుచిత మనస్తత్వం అని మరొకరి పై విమర్శలు చేసే ప్రాధమిక హక్కు ఉందా ? మళ్ళీ పక్కోడికి నీతులు చెప్పడానికి నాగబాబు ఉత్సాహం పడటం మెగా అభిమానులు చేసుకున్న దురదృష్టం. పెద్దరికం అనేది .. స్వయం ప్రకటితంతో రాదు .. చేసే పనులు బట్టి వస్తోంది అని నాగబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చిరంజీవి గారు ఇంతవరకూ సినీ ఇండస్ట్రీకి పెద్ద అని అనుకునే వాళ్ళు. కానీ ఈ ఎన్నికల పుణ్యమా అని గత వారం పది రోజులుగా చిరంజీవి గారు తన తమ్ముళ్ళనే కంట్రోల్ చెయ్యాలేకపోయాడు, ఇక ఆయన ఇంకేం పెద్దరికం చేసినట్లు ? అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
అయినా నాగబాబు నోటిదూలతో వాగి వివాదాలు సృష్టించడం ఎందుకు ? అసలు సంబంధం లేని దానిలో కెలుక్కోవడం ఎందుకు ? చివరకు సిగ్గుతో తల దించుకోవడం ఎందుకు ? అయినా నాగబాబు తన స్టామినా ఏంటో తెలుసుకుని ముందుకు వెళ్తే.. కనీసం మెగా ఫ్యామిలీ పరువు అయినా నిలబడుతుంది.
అసలు రాజకీయాల్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో లో కూడా నాగుబాబు మెగా కుటుంబం గౌరవం పోగొట్టి చిరంజీవి పరువుతీస్తున్నాడు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ ఓటమి మెగా ఆధిపత్యానికి పెద్ద దెబ్బే.