Telangana Unemployed People: తెలంగాణ నిరుద్యోగులూ.. ఇక రెడీ కండి!

Telangana Unemployed People: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో అందుకనుగుణంగా అడుగులు వేస్తోంది. రాష్ర్టంలో దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సంకల్పించడంతో దానికి సబంధించిన ప్రక్రియ కూడా ముందుకు సాగాలని సూచించింది. ఇందులో భాగంగానే ఉద్యోగాల భర్తీ కోసం మంత్రి సబిత చర్యలు చేపడుతున్నారు త్వరలో టెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉపాధ్యాయ భర్తీకి ప్రధాన అర్హతగా భావించే టెట్ నిర్వహించి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. […]

Written By: Srinivas, Updated On : March 14, 2022 6:19 pm
Follow us on

Telangana Unemployed People: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో అందుకనుగుణంగా అడుగులు వేస్తోంది. రాష్ర్టంలో దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సంకల్పించడంతో దానికి సబంధించిన ప్రక్రియ కూడా ముందుకు సాగాలని సూచించింది. ఇందులో భాగంగానే ఉద్యోగాల భర్తీ కోసం మంత్రి సబిత చర్యలు చేపడుతున్నారు త్వరలో టెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉపాధ్యాయ భర్తీకి ప్రధాన అర్హతగా భావించే టెట్ నిర్వహించి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Telangana Unemployed People

నిరుద్యోగుల కోసం ఉద్దేశించిన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం సిద్ధం చేస్తోంది. దీనికి గాను ప్రణాళికలు రచిస్తోంది. ఉద్యోగుల కల్పనకు మార్గం సుగమం చేస్తోంది. నిరుద్యోగుల ఆశలు నెరవేరేలా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి మార్గనిర్దేశం చేస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సంబంధిత శాఖకు సూచించినట్లు సమాచారం. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా స్కూళ్లలో నాణ్యమైన విధ్య అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read: Bandi Sanjay KTR War: బీజేపీకి అస్త్రంలా మారిన కేటీఆర్ వ్యాఖ్య‌లు.. ట‌చ్ చేసి చూడు అంటున్న సంజ‌య్‌..!

ఉద్యోగాల నియామకాల కోసం కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే జోన్ల వారీగా ఉన్న ఖాళీల వివరాలతో నోటిఫికేషన్లు వెల్లడించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించి పోలీసు శాఖ కూడా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఏర్పడుతోంది.

దీనికి గాను ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్ని శాఖల వారీగా పోస్టుల భర్తీకి సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నా త్వరలోనే ఆ తంతు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వివిధ శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

Also Read: Janasena Formation Day LIVE: జనసేన 9వ ఆవిర్భావ సభ: పవన్ కళ్యాణ్ స్పీచ్ లైవ్

Tags