Kiara Advani In Prabhas Movie: కియారా అద్వానీ తెలుగులో పెద్దగా సినిమాలేమీ చేయలేదు. కానీ, తెలుగు ప్రేక్షకులకు ఆమె బాగా సుపరిచితం. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో కియారా అద్వానీ షేర్ చేసే హాట్ హాట్ ఫోటోలు ఆమెను కుర్రకారుకు మరింతగా చేరువ చేశాయి. పైగా త్వరలోనే కియారా ప్రభాస్ సరసన ఒక మూవీ చేయనుంది. ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలు అప్లోడ్ చేసే ఈ భామకి నటిగా పేరు తెచ్చుకునే పాత్రలు అంటే ఇష్టమట. అందుకే, అలాంటి పాత్రలు వస్తే అసలు వదిలి పెట్టను అంటుంది.
అయితే, తాజాగా కియారా అద్వానీ, అలియా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. “నా దృష్టిలో అలియా కెరీర్ అద్భుతం. ఆమె అనేక పాత్రలు చేసింది. గ్లామర్ గా నటించింది. అభినయం చూపించే పాత్రలు చేసింది. మొదటి నుంచి అలియా తన సినిమాల ఎంపిక విషయంలో చాలా వినూత్నంగా ఆలోచించింది. ఆమె ఎంతో వెరైటీగా ముందుకు పోయింది. అందుకే, ఆమెలా నా కెరీర్ ను తీర్చిదిద్దుకోవాలి’ అని ప్లాన్ చేసుకున్నాను అంటూ కియారా చెప్పుకొచ్చింది.
మరి అలియా డేరింగ్ ఆటిట్యూడ్ నచ్చుతుంది అని చెప్తున్న ఈ భామ తాజాగా ప్రభాస్ సినిమాలో నటించబోతుంది. నేషనల్ స్టార్ ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. అయినప్పటికీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతితో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Chiranjeevi – Salman Khan: అక్కడ చిరంజీవిని కలిసి ముచ్చట్లు పెట్టిన సల్మాన్ ఖాన్ !
ఇక మారుతి ఏమి చేసినా బిజినెస్ పరంగా మంచి లాభాలు వచ్చే విధంగా చేస్తాడు. పైగా నిర్మాతలకు లాభాలు వచ్చే సినిమాలే చేస్తాడు. అందుకే ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు. అన్నిటికీ మించి కింద స్థాయి నుంచి రావడంతో మారుతికి మాస్ పల్స్ బాగా తెలుసు. మారుతితో సినిమా చేయడానికి అందుకే స్టార్ హీరోలు కూడా సుముఖంగా ఉంటున్నారు.
అయితే, డైరెక్టర్ గా మారుతి బాగా సక్సెస్ అయినా.. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వలేదు. ఒక్క వెంకటేష్ మాత్రమే డేట్స్ ఇచ్చాడు. కానీ, వెంకీతో మారుతి పెద్ద డిజాస్టర్ చేశాడు. అయితే, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో భారీ విజయం సాధించి మొత్తానికి తనలో మ్యాటర్ ఉందని బలంగా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మారుతి, గోపీచంద్ హీరోగా “పక్కా కమర్షియల్” అనే సినిమా చేస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా మారుతితో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని ఆ మధ్య పుకార్లు వినిపించాయి. మొత్తమ్మీద మారుతి మాత్రం తన తదుపరి చిత్రాలను భారీగా ప్లాన్ చేస్తున్నాడు.
Also Read:Etthara Jenda Song Postponed: ‘ఎత్తర జెండా’ మధ్యలోనే ఆగిపోతే ఎలా రాజమౌళి ?