Unclaimed Bank Deposits in India: మన దేశంలో బ్యాంకులు సేవింగ్స్, రుణాల పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సామాన్యుల నుంచి బిజినెస్ మ్యాగ్నట్స్ వరకు బ్యాంకులు ఆర్థికాభివృద్ధికి పరోక్షంగా దోహదపడుతున్నాయి. ఇక పేద, మధ్యతరగతి ప్రజలు దాచుకునే సొమ్ములకు బ్యాంకులు భద్రత కల్పిస్తున్నాయి. వడ్డీ చెల్లిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అనే తేడా లేకుండా అన్నింటికి ఆదరణ పెరుగుతోంది. అయితే ప్రజలు డిపాజిట్ల రూపొంలో దాచుకుంటున్న నగదు కొందరు తిరిగి తీసుకోకపోవడంతో బ్యాంకుల్లో పేరుకుపోతుంది. తాజాగా ఈ నిల్వలపై కేంద్రం ప్రకటన చేసింది. భారత బ్యాంకుల్లో రూ.67 వేల కోట్ల విలువైన డిపాజిట్లు యజమానులు క్లెయిమ్ చేయకుండా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి పార్లమెంట్‌లో వెల్లడించారు.
Also Read: దేశంలో ఒక్కొక్కరిపై రూ.1.32 లక్షల అప్పు..
బ్యాంకుల వారీగా నిల్వల వివరాలు..
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లలో అత్యధిక భాగం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు: రూ.58,330 కోట్లు, మొత్తం నిధుల్లో 87% వాటా.
ప్రైవేట్ రంగ బ్యాంకులు: రూ.8,673 కోట్లు, మిగిలిన 13% వాటా.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.19,329 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.6,910 కోట్లు
కెనరా బ్యాంకు రూ.6,278 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంకు: రూ.2,063 కోట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు : రూ.1,609 కోట్లు
ఆక్సిస్ బ్యాంకు : రూ.1,360 కోట్లు
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లకు అనేక కారణాలు..
బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఖాతాదారుల మరణం తర్వాత వారసులు ఖాతాలను క్లెయిమ్ చేయకపోవడం. ఖాతాదారులు తమ ఖాతాల గురించి మరచిపోవడం లేదా బ్యాంకుకు చిరునామా మార్పు తెలియజేయకపోవడం. తక్కువ మొత్తంలో డిపాజిట్లు ఉన్న ఖాతాలను నిర్లక్ష్యం చేయడం. బ్యాంకులు కొన్నిసార్లు ఖాతాదారులను సమర్థవంతంగా సంప్రదించలేకపోవడం.
Also Read: టాన్టాలియం.. భారత్‌కు గేమ్–ఛేంజర్‌గా మారనున్న అరుదైన లోహం!
ఈ సమస్యలు గ్రామీణ, పట్టణ రెండు ప్రాంతాల్లోనూ ఉన్నాయి, అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అవగాహన లోపం కారణంగా ఈ సమస్య తీవ్రంగా ఉంది.
ఇలా చేస్తే పరిష్కారం..
బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు తగ్గడానికి బ్యాంకులు, ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల గురించి అవగాహన కల్పించడం. ఖాతాదారుల వివరాలను ఆధార్, పాన్ కార్డులతో అనుసంధానం చేసి, వారిని సులభంగా గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. వారసులు లేదా ఖాతాదారులు సులభంగా క్లెయిమ్ చేయగలిగేలా ప్రక్రియలను సరళీకరించాలి.