Reason for Life Destruction: మంచిని సంపాదించడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది.. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక్క క్షణం చాలు అని అంటారు.. అలాగే ఒక గాజు వస్తువును తయారు చేయడానికి వారం రోజుల సమయం పడుతుంది. కానీ దానిని పగలగొట్టడానికి ఒక్క క్షణం చాలు.. అని అంటారు.. అయితే మనసులో ఎవరు చెడ్డవారు కాలేరు. తమ పరిస్థితులు, అవసరాలు వారిని మార్చేస్తుంటాయి. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా.. ఎంత కష్టం వచ్చినా.. చెడు పని చేయడానికి ఎప్పుడైతే ఒప్పుకోరో.. అలాంటివారు జీవితంలో విజయం సాధిస్తారు. కానీ ఈ ఒక్క విషయం మనసులోకి వస్తే మాత్రం జీవితం నాశనం కావడానికి సమయం పట్టదు. ఇంతకీ ఏ విషయం మనసులోకి రానీయకుండా ఉండాలి? అసలు ఏం చేయాలి?
మనిషికి డబ్బు ఉన్నంత సేపే విలువ ఉంటుంది. ఆ డబ్బు లేకపోతే ఎవరూ పట్టించుకోరు. మరి ఆ డబ్బును కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలి. కానీ కొందరికి డబ్బుతో పాటు అహంకారం కూడా ఉంటుంది. అహంకారం వల్ల జీవితం తొందరగా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తనకు డబ్బు ఉన్నదని ఇతరులను చిన్న చూపు చూడడం.. కుటుంబ సభ్యులను పట్టించుకోకపోవడం.. స్నేహితులను దూరంగా పెట్టడం.. అప్పటివరకు తనకు సహాయం చేసిన వారిని దగ్గరికి రానీయకపోవడం.. వంటి లక్షణాలు ఉంటే ఆ తర్వాత డబ్బు మాయమైనప్పుడు అతను ఒంటరి వాడిగానే మిగిలిపోతాడు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు పనులు చేయకుండా మంచితనంతో ఉంటే సంబంధాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ అహంకారంతో ఉంటే ఒకరు కూడా దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల అహంకారాన్ని వీడాలని కొందరు మేధావులు చెబుతూ ఉంటారు.
అహంకారం వల్ల ఏ పని సక్రమంగా చేయలేరు. ఉద్యోగులు కార్యాలయాల్లో అహంకారంతో ఉండడంవల్ల తోటి వారితో ఎప్పుడూ విభేదాలు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఉన్నత స్థాయిలో ఉన్న వారు అహంకారంతో ఉండడం వల్ల కిందిస్థాయి సిబ్బంది ఎప్పుడూ వారి మంచిని కోరుకోరు. ఇంట్లో అహంకారం ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటాయి. అంతేకాకుండా ఈ లక్షణంతో కుటుంబ సభ్యులు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది.
అహంకారం ఉన్న వ్యక్తికి ప్రతి విషయంలో తనదే గొప్ప అని భావిస్తూ ఉంటాడు. దీంతో ఎదుటివారిని చిన్నచూపు చూస్తూ వారిని వేధింపులకు గురి చేస్తూ ఉంటాడు. అయితే ఎప్పటికైనా ఒకే రకమైన లక్షణం ఉండాలని.. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా.. లేనప్పుడు మరోలాగా ఉండడం వల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఒక పనిని పూర్తి చేయడానికి ఎంతో సమయం పడుతుంది.. కానీ అహంకారం అనే లక్ష్యాన్ని శరీరంలో పెంచుకోవడం వల్ల జీవితం తొందరగా నాశనం అవుతుంది. కుటుంబంలో ఒక్కరికి అహంకారం ఉండటంవల్ల ఆ కుటుంబం మొత్తం నాశనం కావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఒక కార్యాలయంలో ఒక వ్యక్తి అహంకారం వల్ల సంస్థకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.