Russia Ukraine War Update: రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధంతో ఉక్రెయిన్ మాత్రం భయపడటం లేదు. అంతర్జాతీయంగా రష్యాపై ఒత్తిడి పెరుగుతున్నా అది మాత్రం లెక్కచేయడం లేదు. దీనికి ఉక్రెయిన్ కూడా వెనుకాడటం లేదు. రష్యాను ఎదుర్కొంటామని చెబుతోంది. రష్యా సైనిక చర్యను ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రష్యాకు తలొగ్గేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్నారు. తొలిరోజు 74 టార్గెట్లను ఛేదించి ఉక్రెయిన్ కు సవాలు విసురుతున్నారు.
ఉక్రెయిన్ కు చెందిన పలు సైనిక పోస్టులను ధ్వంసం చేస్తూ రష్యా వారిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యా చర్యలకు వెరవడం లేదు. ప్రజలు కూడా భయపడాల్సింది లేనది సూచిస్తోంది. రష్యా ఎన్ని కుట్రలు చేసినా తాము మాత్రం లొంగబోమని ప్రతి సవాలు చేస్తోంది. హెలికాప్టర్లు, డ్రోన్లను సైతం నేల కూల్చుతోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం తగ్గడం లేదు.
Also Read: ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యా ఏకాకిగా మిగులుతోందా?
ఒంటరి పోరాటానికి ఉక్రెయిన్ సిద్ధపడింది. అంతర్జాతీయంగా రష్యా చర్యలను అన్ని దేశాలు ఖండిస్తున్నా ఏ దేశం కూడా ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఆ దేశాధ్యక్షుడు ప్రజలు రష్యాకు భయపడి వలస వెళ్లొద్దని సూచిస్తున్నారు. రష్యాను ఎదుర్కొనేందుకు రెడీ అని ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొడుతున్నారు.
ఈనేపథ్యంలో ఉక్రెయిన్ లోకి రష్యా సైనికుల పేరుతో విధ్వంసకారులు ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. వారి దురాగాతాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయారని వదంతులు పుట్టిస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాను ఎక్కడికి వెళ్లలేదని కుటుంబంతో సహా దేశంలోనే ఉన్నానని చెబుతున్నారు. రష్యా తనపై పుకార్లు పుట్టిస్తోందని దుయ్యబట్టారు.
రష్యా యుద్ధ తంత్రంతో ఉక్రెయిన్ ను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తోంది. అందుకే యుద్ధం కొనసాగిస్తోంది. దీనికి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా లెక్క చేయడం లేదు. యుద్ధంతో ప్రపంచమే బాధ్యత వహించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అన్ని దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: ఇండస్ట్రీ పెద్దల మౌనాన్ని ఈ ఒక్క ట్వీట్ తో పవన్ కడిగేశాడా?